చింతలచెరువుకోటలో కాకతీయ శాసనం

ప్రాంగణంలో పడివున్న 5అడుగుల ఎత్తైన అష్టభుజ వీరభద్రుడు గులాబీరంగురాతి విగ్రహం తీర్చిదిద్దిన శిల్పం.;

Update: 2025-02-22 08:35 GMT

జిల్లా సూర్యాపేట, చింతలపాలెం మండలం(మల్లారెడ్డిగూడెం), ఎర్రకుంట తండ గ్రామం, చింతలచెరువుకోటలో శిథిల దేవాలయం కొన్ని విడి విగ్రహాలున్నాయని గుర్తించారు కొత్త తెలంగాణచరిత్రబృందం సభ్యుడు ఎల్లేటి చంటి సోదరులు. దేవాలయం లలాటబింబంగా చతుర్దళ పుష్పం ఉన్నది. గుడిలో ఏ విగ్రహం లేదు. కాకతీయానంతర కాలపు శైలి. ఆ ప్రాంగణంలో పడివున్న 5అడుగుల ఎత్తైన అష్టభుజ వీరభద్రుడు గులాబీరంగురాతి విగ్రహం తీర్చిదిద్దిన శిల్పం.

అక్కడే మూడురాతిసలపల మధ్య నిలబెట్టిన సతిశిలలో వీరుడు, వీరుని సతి అర్థశిల్పాలున్నాయి. శైలినిబట్టి ఈ సతిశిల 15వ శతాబ్దానికి చెందినది. చింతలపాలెం మండల కేంద్రంలో లభించిన శాసనఫలకం మీద 10 పంక్తుల తెలుగులిపి, తెలుగుభాషలో కాకతీయపాలనాకాలానికి చెందిన 13వ శతాబ్దపు దానశాసనం ఉంది.

 

శాసన పాఠం:

సూర్య, చంద్ర చిహ్నాలు

1. స్వస్తిశ్రీ శక వరుషంబులు

2. (1219)హేమళంబి సంవత్స

3. వైశాఖ శు. 5గు ప్రాంపేట సమ

4. ...ఊరి నడిమి మల్లినాథని ది

5. (ప)..మ అంమంబడిని గద్దె నా...

6. ....డిలఈ విగుము ఇచ్చిరి11

7. ..లనయోర్మధ్యే దానా

8. ...నుపాలనం1దానస్వర్గ

9. ...వాప్నోతి పాలనాదచ్చు

10. ...పదం11

శాసన సారాంశం:

శక సం.1219 హేమలంబి వైశాఖ శు. పంచమిన అంటే క్రీ.శ. 1297 ఏప్రిల్ 27(శనివారం)రోజున ప్రాంపేట ఊరి నడుమనున్న మల్లినాథుని పూజాదికాలు దీపం, అమ్మపడి(అమ్ముపడి) నైవేద్యం కొరకు గద్దె భూమిని దానం చేసారు.

క్షేత్రపరిశోధన: ఎల్లేటి చంటి, కొత్త తెలంగాణచరిత్రృందం సభ్యుడు, చారిత్రక వివరణ, శాసన పరిష్కారం: శ్రీరామోజు హరగోపాల్, 9949498698, కన్వీనర్ కొ.తెచబృం.

Tags:    

Similar News