కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు..
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసింది కాళేశ్వరం కమిషన్. 15 రోజుల్లో కమిషన్ ముందు హాజరు కవాలని గడువు విధించింది.;
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించడం ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితమే ఈ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయిందని ప్రకటించారు. కాగా తాజాగా ఈ కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిషన్ గడువు మే 31తో ముగియనుంది. విచారణ పూర్తయింది, కమిషన్ గడువు కూడా పూర్తికావొస్తున్న క్రమంలో ప్రభుత్వం ఒక్కసారిగా కమిషన్ విచారణ గడువును పెంచడం కీలకంగా మారింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు విచారించని కేసీఆర్, హరీష్, ఈటల రాజేందర్‌ను విచారించడం కోసమే ఈ గడువు పొడిగించినట్లు అర్థమైపోతోంది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై దృష్టి పెట్టింది. బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై కమిషన్ విచారణ జరిపింది. సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను విచారించింది. వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ను కూడా విచారణకు పిలవాలని కమిషన్ మొదట భావించింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వారిని విచారణకు పిలవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయానికి కమిషన్ వచ్చినట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఈ కేసు విచారణకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసింది కాళేశ్వరం కమిషన్. 15 రోజుల్లో కమిషన్ ముందు హాజరు కవాలని గడువు విధించింది.
కమిషన్ ఎపుడొచ్చింది...
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయిం ది. బరాజ్ లోని ఏడో బ్లాక్ మీటరున్నర మేర భూమి లోపలికి కూరుకుపోయింది. దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ ఏ), ఇటు విజిలె న్స్ డిపార్ట్మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికలు సమర్పించాయి. న్యాయపరంగా విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్ గా 2024 మార్చి 13న కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ను నియమించారు.
2024 జూన్ 30లోపు విచారణ పూర్తి చేయాలి. అప్పటికి ఇంకా ఎంక్వైరీ కూడా మొదలుకాలేదు. ప్రాథమిక దశలోనే ఉండడంతో గడువును ఆగస్టు 30 వరకు పొడిగిస్తూ జూన్ 29న తొలిసారి గడువును పొడి గించింది. మళ్లీ విచారణ నత్తనడకే సాగింది. దీంతో రెండోసారి అక్టోబర్ 31 వరకు గడువును పొడిగిస్తూ ఆగస్టు 28న ప్రభు త్వం ఉత్తర్వులు ఇచ్చింది. అసలు విచారణకు ఓపెన్ కోర్టులు నిర్వహించాల్సి ఉండడంతో డిసెంబర్ 31 వరకు గడువును మూడోసారి పొడిగిస్తూ నవంబర్ 12న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత నాలుగోసారి 2025 ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగిస్తూ 2024 డిసెంబర్ 21న, ఐదోసారి 2025 ఏప్రిల్ 30 వరకు పొడిగి స్తూ 2025 ఫిబ్రవరి 20న, ఆరోసారి గడువును 2025 మే 31 వరకు పొడిగిస్తూ 2025 ఏప్రిల్ 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఏడోసారి గడువును పొడిగిస్తూ జులై 31 వరకు కమిషన్ రిపోర్టుకు గడువు ఇచ్చింది.