Himanshu's song for father | సోషల్ మీడియాలో హిమాన్షు పాట వైరల్

తండ్రి కేటీఆర్ కోసం కొడుకు హిమాన్షు పాడిన పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హిమాన్షు పాడిన పాటను కేటీఆర్ ట్వీట్ చేయడంతో హిమాన్షు వార్తల్లోకి ఎక్కారు.

Update: 2024-12-29 02:45 GMT

అమెరికా దేశంలో ఉన్నత విద్య అభ్యసిస్టున్న కల్వకుంట్ల హిమాన్షు తన తండ్రి కేటీఆర్ కోసం పాడిన పాట సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

‘‘నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే ...
నా కన్నులకు నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే ...
నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి నాన్నా
నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట ఆ మాట నాన్నా నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట నిజాన్ని ఇలా అనేదెలా ఇవ్వాళ నీ ఎదుట....
నీ చేతులలో ఊయల ఊగిన ఆ సంబరం ఇంకె ఎప్పుడు?
నీ భుజములపై తలవాల్చుకునే ఆ పండుగ నాకెపుప్పుడు క్షణాన్ని సవాలు ఇలా జవాబు లేదిప్పుడు నాన్నా’’ అంటూ సాగిన పాట అందరినీ ఆకట్టుకుంటోంది.

తండ్రిగా ఎంతో గర్వపడుతోన్నా: కేటీఆర్
తన కుమారుడి టాలెంట్ చూసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. జులై నెలలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హిమాన్షు 'నా సూర్యుడివి.. నా చంద్రుడివి.. నా దేవుడివి నువ్వే, నాన్నా' పాటను స్వయంగా పాడి తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ పాటపై కేటీఆర్ స్పందిస్తూ ‘‘ఈ కష్టతరమైన సంవత్సరంలో ఇది నాకు ఉత్తమ బహుమతి. తండ్రిగా ఎంతో గర్వపడుతున్నాను’’ అని భావోద్వేగంతో ట్వీట్ చేశారు..కష్టతరమైన సంవత్సరంలో నాకు ఉత్తమ బహుమతి అని కేటీఆర్ వివరించారు. ‘‘జులైలో నా పుట్టినరోజు కోసం నా కొడుకు దీన్ని రికార్డ్ చేశాడు. కానీ అది సరిపోదని భావించి విడుదల చేయకుండా తప్పుకున్నాడు!!!’’ అని కేటీఆర్ వివరించాడు.

నెటిజన్ల నుంచి స్పందన
‘‘పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు
జనులా పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోస్తాహంబు నాడు పొందుర సుమతీ..!!’’ అని నేడు కేసీఆర్ గారికి నీ వల్ల, రేపు నీకు హిమాన్షు వల్ల కలిగే పుత్రోత్సాహం ప్రతి తండ్రి ఆశించే, కలలు కనేదే రామన్న’’ అంటూ వరంగల్ జిల్లాకు చెందిన ఓ నెటిజన్ ఎక్స్ లో పోస్టు చేశారు.

Tags:    

Similar News