Kavitha | బీజేపీ ప్లస్ కాంగ్రెస్ 16 మంది ఎంపీలు,తెలంగాణకు జీరో నిధులు

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ జీరో చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు.;

Update: 2025-02-01 08:49 GMT
జీరో బడ్జెట్ పై బీఆర్ఎస్ పోస్టర్

తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి 8 మంది పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలున్నా తెలంగాణ కు మాత్రం కేంద్ర బడ్జెట్ లో రిక్తహస్తం చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ , మహిళా జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బడ్జెట్ విడుదలైన తర్వాత కవిత తన ఎక్స్ ఖాతాలో బడ్జెట్ పై పోస్టు చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని కవిత విమర్శించారు.

జీరో బడ్జెట్ పై బీఆర్ఎస్ పోస్టర్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 16 మంది ఎంపీలున్నా తెలంగాణకు జీరో బడ్జెట్ తెచ్చారని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు భరత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదీ 16 మంది తెలంగాణ ఎంపీల ఘనత అని ఆయన పేర్కొన్నారు.కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జీరో బడ్జెట్ అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News