ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి కానీ.. ప్రజాస్వామ్యం ఓడిపోయిందని కవిత అన్నారు. బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.;

Update: 2025-03-06 06:33 GMT

బీసీలకు అడుగడునా అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రతి అంశంలో బీసీలను అణచివేస్తున్నారని, బీసీల కోసం పోరాడేది బీఆర్ఎస్ ఒక్కటేనని కవిత అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం బీసీలను అన్యాయమే జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క బీసీ అభ్యర్థి కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీ కూడా బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీయేతర అభ్యర్థులనే బరిలోకి దింపాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి కానీ.. ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఆమె అన్నారు. ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు ఉన్నప్పుడు బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు కవిత. ఆ నినాదంతోనే ప్రసన్న హరికృష్ణకు చాలా ఓట్లు వచ్చాయి. పార్టీల పరంగా, సిద్ధాంతాల పరంగా ఓట్లు చీలడం వల్లే బీసీ అభ్యర్థి గెలవలేదు.

బీసీలను న్యాయం జరగాలంటే చట్టసభల్లో కూడా వారికి రిజర్వేషన్లు ఉండాలి. బీసీ రిజర్వేషన్లు ఉండి ఉంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు బీసీ అభ్యర్థి ఒక్కరికైనా అవకాశం ఇచ్చి ఉండేవన్నారు కవిత. ఇకపైన ఇలా కాకుండా ప్రభుత్వం చూడాలని, బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ల కోసం మూడు బిల్లులు ప్రవేశపెట్టాలని కోరారు. ‘‘ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలి. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులు పెట్టాలి. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం కేవలం రాష్ట్రం పరిధిలో ఉంటుంది. పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ రాష్ట్ర స్థాయిలోనే చట్టం తెచ్చి సాధ్యం చేశారు’’ అని తెలిపారు కవిత.

రాష్ట్రస్థాయిలో చట్టం తీసుకురావడం ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉందని, కానీ కాంగ్రెస్ మాత్రం అందుకు విరుద్ధంగా అడుగులు వేస్తోందని కవిత విమర్శించారు. మూడు అంశాలను ఒకే బిల్లులో పెట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచకుండా ఉండాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. మూడు అంశాలను ఒకే బిల్లులో పెడితే న్యాయపరమైన వివాదం తలెత్తుతుందని, జనాభాలో 50శాతానికిపైగా ఉన్న బీసీలకు సంబంధించిన అంశం కాబట్టి దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని కవిత అన్నారు.

Tags:    

Similar News