‘కవిత లేఖను ప్లాన్ చేసింది కేటీఆర్, హరీష్ రావే’

బీజేపీ గురించి కేసీఆర్ ఎంతసేపు మాట్లాడాలో కూడా కవిత డిసైడ్ చేస్తారా?;

Update: 2025-05-23 08:54 GMT

కేసీఆర్‌కు కవిత రాసిన లేఖే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. ప్రతి పార్టీ నేతలు దీని గురించే చర్చిస్తున్నారు. తమ అభివృప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. కొందరు కవిత అడిగినవన్నీ నిజాలే అంటే.. మరికొందరు ఇదంతా కూడా ఓ డ్రామా అంటున్నారు. డ్రామా అంటున్న వారిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒకరు. కేసీఆర్‌పై కవిత లేఖాస్త్రం అంతా కూడా కల్వకుంట్ల కుటుంబంలోని నటన కళాస్త్రం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ లేఖను కావాలని కల్వకుంట్ల కుటుంబమే బయపెట్టిందని, రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే వాళ్లు ఈ డ్రామాకు తెరలేపారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా అసలు కేసీఆర్‌కు సలహాలు, సూచనలు చేసే స్థాయి కవితకు ఉందా అంటూ ప్రశ్నించారు. ‘‘బీజేపీ గురించి కేసీఆర్ ఎంతసేపు మాట్లాడాలో కూడా కవిత డిసైడ్ చేస్తారా? కేటీఆర్, హరీష్ రావు కలిసే ఈ లేఖ తయారు చేయించారు. కవిత పేరుతో బయటకు వదిలారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి. ఆ రెండు పార్టీల మధ్య బంధం ఈ లేఖతో బయటపడింది. వరంగల్ సభతోనే బీఆర్ఎస్ పనయిపోయిందని తేలిపోయింది. రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ డ్రామాలు ఆడుతున్నారు’’ అని ఆయన అన్నారు. ఇదే విధంగా కవిత లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఘాటుగా స్పందించారు.

బీఆర్ఎస్‌లో వారసత్వ చిచ్చు: రఘునందన్

‘‘కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయతీనా , ఆస్తుల పంచాయతీనా..? కవిత చెప్పినా చెప్పకున్నా తెలంగాణలో బీజేపీ బలపడుతున్నది. వచ్చే ఎన్నికల తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు వచ్చింది నిజమని తెలుస్తోంది. కవితను బయటకు పంపించడం కోసం బావా , బామ్మర్దులు ఒక్కటి అయ్యారు అనే సంకేతం వారి మీటింగ్ ద్వారా ఇచ్చారు. కవిత మరో షర్మిల కాబోతున్నట్టుగా కనిపిస్తున్నది. కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్ కు సంబంధించిన పత్రిక, టీవీ లలో వార్త ప్రముఖంగా వచ్చింది. కవిత కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సీఎం ఈ డ్రామా వెనకా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. లేదా ఇటీవలే తెరాస సిద్ధాంత కర్త, పునాది అని చెప్పుకునే వ్యక్తి హరీష్ తో పార్టీ పెట్టించాలని అన్నాడు. ఇప్పుడు కవిత తో పార్టీ పెట్టించి కాంగ్రెస్ తో దగ్గరయ్యే ప్రయత్నం సాగుతున్నది. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ లో బీజేపీ పార్టీ అధికారం చేపట్టడం ఆపడం ఎవరి తరం కాదు’’ అని పేర్కొన్నారు.

బీజేపీతో దోస్తానా వద్దనే కవిత చెప్పారు: పొన్నం

‘‘తెలంగాణ సగటు మనిషికి ఉన్న అనుమానాలు,కాంగ్రెస్ పార్టీ చేసిన అరోపణలు కవిత లెటర్ కి అర్థం పడుతుంది. బిఅర్ఎస్, బిజేపి దోస్తానా మంచిది కాదని కవిత ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ వీరి దొస్తానా గురించి అడుగుతే రాజకియం అన్నారు. రజతోత్సవం సభలో నాటి బిఅర్ఎస్ లీడర్లనీ ఎందుకు పిలువలేదని ప్రశ్నించింది. డిల్లీ లో దొస్తి,గల్లిలో దొస్తానాపై‌ మేము చేసిన అరోపణలకి కవిత వ్యాఖ్యలు నిజమని తేలింది. గ్రేటర్ హైదరాబాదు ఎమ్మెల్సీ ఎన్నికలలో వారిద్దరి దొస్తానా బయటపడింది. బిజేపికి భారస ని సలెండర్ చేస్తామన్న మాటలు నిజమనే వ్యాఖ్యలపై కవిత ప్రశ్నించింది. తెలంగాణ కి పదేండ్లనుండి అన్యాయం జరుగుతే ప్రశ్నించలేదు. కెటిఅర్ చిట్ చాట్ కొండను తవ్వి ఎలుకని పట్టినట్లు ఉంది. ఈడి,ఎన్ఫోర్స్ మెంట్ సంస్థలని కుటుంబ సంస్థలుగా బిజేపి వాడుకుంటుంది. కాళేశ్వరం నోటీసులు,కవిత బాంబులు బిఅర్ఎస్ పార్టీకి సంకటగ గా మారాయి. కవితగారు పేల్చిన బాంబులపై‌ కెటిఅర్ స్పందించాలి. కవితగారు నేరుగా పార్టీ అధ్యక్షుడు పై‌ మొదటినుండి ఉన్నవారికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రశ్నించింది’’ అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News