అసెంబ్లీకి కేసీఆర్ హాజరు..
సభలో నడుచుకోవాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్‌ఎల్పీ నేతలతో సమావేశమైన వారికి కీలక సూచనలు చేశారు.;
By : The Federal
Update: 2025-03-12 05:30 GMT
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. అసెంబ్లీకి హాజరయ్యారు. ఈరోజు నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ హాజరయ్యారు. సమావేశాలు ప్రారంభానికి ముందు తన ఛాంబర్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యారు. సభలో నడుచుకోవాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్‌ఎల్పీ నేతలతో సమావేశమైన వారికి కీలక సూచనలు చేశారు. అసెంబ్లీ సెషన్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో భాగంగానే ప్రభుత్వాన్ని ఏయే విషయాల్లో ప్రశ్నించాలి అన్న అంశాల గురించి వివరించారు కేసీఆర్. ప్రతి నేత కూడా సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రతి రోజూ సభలకు రావాలని, సమయానికి రావాలని కేసీఆర్ సూచించారు.