ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారా..?

ఎస్‌ఎల్‌బీసీ కూలడానికి ఈ పూజలే కారణమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.;

Update: 2025-08-11 15:06 GMT

శ్రీశైలం ఎడమ కాలువ(SLBC) సొరంగం కూలడానికి కేసీఆర్ కుటుంబమే కారణమంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సొరంగం కూలిపోవాలంటూ కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో క్షుద్రపూజలు చేశారని ఆరోపించారు. తనపై కోపంతోనే ఇలా చేశారని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 43 కిలోమీటర్లు ఉన్న ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ఓ అద్భుతమైని, అలాంటిది కూలిపోవడం దురదృష్టకరమని అన్నారు. కానీ దీని వెనక కేసీఆర్ హస్తం ఉందంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కేసీఆర్ కాళేశ్వరం అసలు అద్భుతమే కాదని విమర్శించారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రావడంతో బీఆర్ఎస్ నేతలు నోరు మెదపడం లేదు. ఈ నివేదికతో బీఆర్ఎస్ బాగోతం బట్టబయలయింది.ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయింది. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అన్ని విధాలా నాశనం చేసింది. ప్రజలను మభ్యబెట్టడానికి బీఆర్ఎస్.. కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు. కాంగ్రెస్‌పై ఉన్న నమ్మకంతోనే ప్రజలను అసెంబ్లీ ఎన్నికల్లో మాకు పట్టం కట్టారు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ నిరంతరం కృషి చేస్తుంది. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సుభిక్షంా ఉన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పరుగులు పెడుతోంది’’ అని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో క్షుద్రపూజలా..

ఇటీవల ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్.. ప్రత్యేక పూజలు చేశారన్న వార్తలు రాష్ట్రమంతా సంచలనంగా మారాయి. చండీయాగం చేయడానికే ఈ పూజలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఈ వార్తలను బీఆర్ఎస్ సోషల్ మీడియా సెల్ తోసిపుచ్చింది. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి.. క్షుద్రపూజలంటూ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. క్షుద్రపూజలు కావడం వల్లే.. బీఆర్ఎస్ వర్గాలు వాటిని దాచిపెడుతున్నాయా? అన్న చర్చ కూడా మొదలైంది. అదే సమయంలో పూజలు చేసి అనుకున్నది సాధించే పనయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కేసీఆర్.. క్షుద్రపూజలు చేయొచ్చు కదా? అని అంటున్నవారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి చేసిన క్షుద్రపూజల వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి వీటిపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News