కేసీఆర్ కీలక సమావేశం

ఈనెల 19వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో కీలకమైన సమావేశం జరగబోతోంది;

Update: 2025-02-13 10:53 GMT
KCR and KTR

ఈనెల 19వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో కీలకమైన సమావేశం జరగబోతోంది. పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 1 గంటకు సమావేశం మొదలవ్వబోతోంది. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, మాజీలు, జిల్లాల అధ్యక్షులు, వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా చేసినవారు, నియోజకవర్గస్ధాయి నేతలందరు హాజరవబోతున్నారు. 19వ తేదీన మీటింగ్ జరగబోతోంది అంటే 27వ తేదీన జరగబోయే మూడు ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటింగ్ పై కేసీఆర్(KCR) ఏదైనా దిశానిర్దేశం చేస్తారేమో అని ఆలోచించాల్సిన అవసరంలేదు. ఎందుకంటే జరగబోయే మీటింగుకు 27వ తేదీన జరగబోయే ఎన్నికలకు ఎలాంటి సంబంధంలేదు. మూడు ఎంఎల్సీ ఎన్నికల ఓటింగ్ కు సంబంధించిన ముచ్చట ఉండే అవకాశమే లేదని పార్టీవర్గాల సమాచారం.

మరింతకీ మీటింగ్ ఎందుకంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చెప్పినట్లుగా పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళవుతున్న సందర్భంగా కేసీఆర్ అందరినీ కలవబోతున్నారు. పార్టీ ఏర్పడి 25 ఏళ్ళవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, పార్టీసభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం విషయాలను విస్తృతస్ధాయిలో చర్చించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాల మీద కూడా చర్చలు జరుగుతాయని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పార్టీపరంగా అనుసరించాల్సిన విధివిధానాలను, అనుసరించాల్సిన కార్యాచరణను కూడా అదేరోజు నిర్ణయించబోతున్నట్లు కేటీఆర్ చెప్పారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేసేట్లుగా ఒకవైపు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతునే మరోవైపు ప్రజలను చైతన్యంచేయటం, పార్టీనేతలుగా హక్కులను, బాధ్యతలను కాపాడుకోవటం ఎలాగన్న విషయాలపైన కూడా చర్చలు జరుగుతాయన్నారు. రాష్ట్రరాజకీయ పరిస్ధితులపై సమగ్రమైన చర్చలు జరిపి కార్యాచరణ, నిర్ణయాలను తీసుకోబోయే సమావేశం కాబట్టి 19వ తేదీన జరగబోయే విస్తృతస్ధాయి సమావేశానికి అందరు తప్పకుండా హాజరవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు.

.

Tags:    

Similar News