‘ఆపనిచేయద్ద’ని రేవంత్ కు చెప్పిన కిషన్ రెడ్డి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి దగ్గరున్న 400 ఎకరాల భూమిని వేలంపాటలో అమ్మద్దని కిషన్ కోరారు;

Update: 2025-03-27 07:36 GMT
Revanth and Kishan

రేవంత్ రెడ్డికి కేంద్ర టూరిజంశాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖరాశారు. లేఖలో ఏముందంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి దగ్గరున్న 400 ఎకరాల భూమిని వేలంపాటలో అమ్మద్దని కిషన్ కోరారు. అభివృద్ధిపేరుతో ప్రభుత్వ భూముల అమ్మకాన్ని కిషన్ వ్యతిరేకించారు. ఇంతకీ రేవంత్(Revanth) కు కిషన్ ఎందుకు లేఖ రాసినట్లు ? ఎందుకంటే ఈ భూములపై పెద్దఎత్తున వివాదం రేగుతోంది. ప్రభుత్వం అమ్మాలని అనుకుంటున్న 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(హెచ్సీయూ)భూములని గొడవనడుస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తు రెండురోజుల క్రితం యూనివర్సిటి విద్యార్ధులు ఆందోళన కూడా చేశారు. కాబట్టి ప్రభుత్వం వేలంద్వారా అమ్మాలని అనుకుంటున్న 400 ఎకరాలు యూనివర్సిటి భూములనే ప్రచారం బాగా పెరిగిపోయింది.

ఈనేపధ్యంలోనే బుధవారం రేవంత్ ఇదే విషయమై మాట్లాడుతు ప్రభుత్వం వేలంద్వారా అమ్మాలని అనుకుంటున్న భూములు యూనివర్సిటీవి(Hyderabad Central University) కావన్నారు. 400 ఎకరాలకు యూనివర్సిటీకి సంబంధమే లేదని చెప్పారు. 25 ఏళ్ళక్రితం ప్రభుత్వం ఐఎంజీ భారత్ కు కేటాయించిన భూములుగా రేవంత్ ప్రకటించారు. ఇన్నిసంవత్సరాలపాటు కోర్టులో నడిచిన వివాదం చివరకు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో ప్రభుత్వం ఐఎంజీ భారత్ కు కేటాయించిన వేలాదిఎకరాలను హైకోర్టు రద్దుచేసిందన్నారు. కోర్టు భూకేటాయింపులను రద్దుచేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం 400 ఎకరాలను స్వాధీనంచేసుకోలదని చెప్పారు.

భూములస్వాధీనంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంచేసిందని చెప్పిన రేవంత్ ఆ భూములను తమ ప్రభుత్వం స్వాధీనంచేసుకుని వేలంద్వారా అమ్ముతామని ప్రకటించారు. రేవంత్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపైనే తాజాగా కేంద్రమంత్రి కిషన్(Central Minister Kishan Reddy) లేఖ రాశారు. 400 ఎకరాల అమ్మకానికి వ్యతిరేకంగా కిషన్ లేఖ రాశారు. 400 ఎకరాలను అమ్మకూడదని తన లేఖలో రేవంత్ కు కిషన్ సూచించారు. రేవంత్ కు రాసిన లేఖలో కిషన్ చేసిన సూచన బాగానే ఉంది కాని మరి భూములు అమ్మకపోతే ప్రభుత్వానికి డబ్బులు ఎలాగవస్తుందనే విషయాన్ని చెప్పలేదు. బీఆర్ఎస్(BRS) హయంలో కూడా ప్రభుత్వభూములను వేలంద్వారా అమ్మిన విషయం తెలిసిందే.

సంక్షేమపథకాల అమలు లేదా అభివృద్ధి పనులకు ప్రభుత్వాలు భూములను వేలంద్వారా అమ్మేయటం మామూలైపోయింది. ఎందుకంటే ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి ఆచరణసాధ్యంకాని హామీలిచ్చేసి అధికారంలోకి రాగానే ప్రభుత్వభూములను అమ్మేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల విషయాన్ని పక్కనపెట్టేస్తే కేంద్రంలో నరేంద్రమోడీ(Narendra Modi) ప్రభుత్వం చేస్తున్నది కూడా ఇదే. గడచిన 11 ఏళ్ళలో మోడీ ప్రభుత్వం సుమారు 80 ప్రభుత్వరంగ సంస్ధలను అమ్మేసిన విషయం అందరికీ తెలిసిందే. ఏదో కారణంచెప్పి ప్రభుత్వరంగసంస్ధలను, ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారు. ఇపుడు రేవంత్ కూడా అదేబాటలో నడుస్తున్నాడు.

ఇంత అర్జంటుగా రేవంత్ కు కిషన్ ఎందుకు లేఖరాసినట్లు ? ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వ భూముల అమ్మకాన్ని రేవంత్ వ్యతిరేకించారట. అప్పుడు ప్రభుత్వభూముల అమ్మకాన్ని వ్యతిరేకించారు కాబట్టి ఇపుడు భూములను అమ్మవద్దని కిషన్ లేఖలో సూచించారు.

Tags:    

Similar News