ముఖ్యమంత్రికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

రెన్యూవబుల్ ఎనర్జీ కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వ సహకారం;

Update: 2025-07-17 10:37 GMT

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి జి. కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతిపాదించిన రెన్యూవబుల్ ఎనర్జీ కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వ సహకారం అవసరమని ఈ లేఖలో కోరారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (CPSU)ముఖ్యంగా కోల్ ఇండియా లిమిటెడ్ (CIL), నైవేలి లిగ్నయెట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ (NLCIL) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వ్యామ్యం కుదుర్చుకుని సౌర పవన విద్యుత్ ప్లాంట్లు, పంప్ స్టోరేజి ప్రాజెక్టులు (PSP), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) కీలక పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నాయని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు వచ్చే మూడేళ్లలో 10 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించనున్నాయి.

Tags:    

Similar News