Komatireddy | ‘నన్ను విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదు’
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. తాను నీతి, నిజాయితీకి మారుపేరని చెప్పుకొచ్చారు.;
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. తన గురించి విమర్శలు చేసే స్థాయి ఆయనకు లేదన్నారు. తాను నీతి, నిజాయితీకి మారుపేరని చెప్పుకొచ్చారు. గాంధీభవన్‌లో మంత్రులతో నిర్వహించిన క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగానే కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఆయనపై పలు కేసులు ఉన్నాయని, తనపైన ఒక్క కేసు కూడా లేదని అన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. సభకు రాకూడదని నిశ్చయించుకుంటే ఆ పదవికి కేటీఆర్, హరీష్‌లలో ఒకరికి ఇవ్వాలని సూచించారు. అప్పుడు మాత్రమే వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్తామని అన్నారు.
‘‘పనికి రాని మాటల గురుంచి మాట్లాడితే టైం వేస్ట్. అంచాలంచలుగా ఎదిగి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అయ్యాడు. ఇప్పటి నుండి మళ్ళీ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పీసీసీ ఆదేశాల మేరకు... ఇది కొనసాగుతుంది.. ప్రజలు ఎక్కడికి వచ్చి అయిన వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నడా.. బండి సంజయ్ ఉన్నడా...? అణగారిన ప్రజల కోసం గజ్జె కట్టి పాట పాడి. ఉద్యమం చేసిండు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ మాట్లాడం కరెక్ట్ కాదు. ఆ మందితో ఎందుకు ధర్నా పెట్టిండు... ఈ మొఖం పెట్టుకుని వచ్చిండు. పదేండ్లు మంత్రులుగా ఉండి ఒక్కరు కూడా పోలేదు. కేటీఆర్, హరీష్ రావు నా కాళీ గోటికి కూడా సరిపోరు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘కేసీఆర్ పేరు చెప్పుకుని మంత్రివి అయ్యావు. నీతి నిజాయితీ కి మారు పేరు వెంకట్ రెడ్డి. నాపై ఎక్కడైనా అవినీతి మరక ఉన్నదా. ప్రతి పక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుంటే.... ఏం చెప్తారు. మూసి ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు..? ఇక్కడ మూసి చేయొద్దటా... అక్కడ యమున చేస్తారట. మూసి క్లీన్ చేస్తాం అంటే... అక్కడికి పోయి బీజేపీ నాయకులు ఏసీ రూమ్ లలో పడుకున్నారు. కేసీఆర్‌కి నైతిక హక్కు లేదు... నాపై మాట్లాడినికి.... కేటీఆర్ బచ్చగాడు..? వాళ్ళ దగ్గర ఏముంది... లక్షల కోట్లు... ఈ కార్ రేస్... అవినీతి తప్ప’’ అని విమర్శించారు.
‘‘నాకు లక్షల కోట్లు లేవు... ప్రజల అండ దండలు ఉన్నాయి. అమెరికాలో చదువుకుని.. ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు.. నేను తిడితే వాళ్ళ తలకాయ పగిలి పోతది. జైలుకు పోయిన లాలు ప్రసాద్ నయం... కేసీఆర్ జైలుకి పోకుండానే... ఒక్క సారి అసెంబ్లీ కి రాలేదు... మామ చాటు అల్లుడు.. హరీష్ రావు... తండ్రి చాటు కొడుకు కేటీఆర్’’ అని ఎద్దేవా చేశారు.