Konda Surekha | కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చుని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారా?
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌పై మంత్రి కొండారేఖ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.;
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్(KCR)పై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చుని మాటలు చెప్పడం కాదని, దమ్ముంటే బయటకొచ్చి మాట్లాడాంటూ ఛాలెంజ్ చేశారు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్(BRS)కు కార్యకర్తలు గుర్తొస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆపార్టీకి చెందిన కొందరు కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి తీవ్ర విమర్శలు చేస్తున్నారు, అసలు వారికి ఆ అర్హత లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు కొండా సురేఖ. ఈ సందర్బంగానే కేసీఆర్‌పై మండిపడ్డారామే. కేసీఆర్ మాట్లాడే భాష ఒక దరిద్రమంటూ విమర్శలు గుప్పించారు. వాళ్ల నాన్న కూడా ఆ విధంగా మాట్లాడలేదని, అధికారి మదంతో ప్రతి ఒక్కరినీ చులకనా చూసిన వ్యక్తి కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు కొండా సురేఖ.
ప్రజలు బీఆర్ఎస్ వద్దనుకున్నారు..
ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమను పరిపాలించడానికి బీఆర్ఎస్ వద్దు అని ప్రజలు భావించారని, అందుకే కాంగ్రెస్‌కు ఘన విజయం కట్టబెట్టారని అన్నారు. ‘‘ఫామ్ హౌస్‌లో పడుకుని కేటీఆర్ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు వద్దు అనుకున్నారు కాబట్టే కాంగ్రేస్‌ను గెలిపించారు. ఒక్కో కులం గురించి ఆలోచన చేసే ప్రభుత్వం అది రేవంత్ రెడ్డిది. గౌడ్ల భద్రత కోసం పరికరాలు అందించిన వ్యక్తి రేవంత్. కేటీఆర్ మాట్లాడే భాష దరిద్రమైన భాష వాళ్ళ నాయనా ఎన్నడూ అలా మాట్లాడలేదు. తెలంగాణ వస్తది అని తెలిసి అమెరికా నుండి తట్టబుట్ట సర్దుకుని చెల్లి, అక్క వచ్చారు. తెలంగాణ ఉద్యమం క్రెడిట్ కోసం నీ చెల్లి నువ్వు రాష్ట్రానికి వచ్చారు. ప్రభుత్వాన్ని పడగొడతా అంటున్న నీ విజ్ఞత ఏంటో అర్ధం అవుతుంది. యువత జీవితాలతో ఆడుకున్నది కేసీఆర్.. మా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మూసీ ఉద్యమం చేస్తాం అంటున్నారు ఈ సారి పెట్రోల్ బాటిల్ తెచ్చుకోండి అగ్గిపెట్టే ప్రజలు ఇస్తారు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అతనికి ఆ స్థాయి లేదు..
‘‘గంధం చెక్కల వ్యాపారం చేసుకునే ఎమ్మెల్యే.. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నా. గంధం చెక్కల ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి నాది కాదు. మా మంత్రిని ప్రొటెక్ట్ చేసే బాధ్యత సహచర మంత్రిగా నాపై ఉంది. అందుకే మాట్లాడ్తున్నా అంతే.. ఆనాడు రాజీనామాలు చేయాల్సి వస్తే పారి పోయిన దొంగలు మీరు. రాష్ట్రం కోసం రాజీనామా చేసిన చరిత్ర కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్‌ది. నీ గంధం చెక్కల వ్యాపార మడత పెడితే అప్పుడు నీకు తెలుస్తుంది. కేసులు నమోదు చేసి బొక్కలో వేస్తే అప్పుడు తెలిసొస్తుంది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘ఇంకో పిచ్చోడు హుజురాబాద్ ఎమ్మెల్యే. అసెంబ్లీ వాతావరణం చెడగొట్టిన సంస్కృతి ఆ ఎమ్మెల్యేది. నిండు అసెంబ్లీలో చప్పట్లు కొట్టే సంస్కృతిని ఆ ఎమ్మెల్యే తెచ్చాడు. మహిళల పట్ల గౌరవం లేకుండా మాట్లాడే ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే. ఆటో వాల వద్దకు పోతే ఎల్లగొట్టారు, గిరిజనుల దగ్గర పోతే బీఅరెస్ నాయకులను ఎల్లగొట్టారు. ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రతిపక్ష పార్టీల ట్రాప్‌లో పడే అవకాశం లేదు’’ అని వివరించారు.
మేము అరెస్ట్‌లు చేస్తే వేరేలా ఉంటది..
‘‘చిన్న డ్రోన్ విషయంలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. అదే విధంగా మేం అరెస్టు చేయాలనుకుంటే బీఆర్ఎస్ నేతలంతా జైల్లో ఉండేవాళ్ళు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ నేతల హస్తం లేకపోతే ఆఫీసర్లను దేశం ఎందుకు దాటించారు. చేసేది న్యాయమే అయితే సోషల్ మీడియాను వేరే దేశం నుండి నడపాల్సిన అవసరం ఏంటి?’’ అని ప్రశ్నించారు.