‘నియోజకవర్గ పునర్విభనతో దక్షిణాదికి అన్యాయం’
ఇండియా లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక్క వ్యక్తి తన ఓటు హక్కును కోల్పోయినా.. దానిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.;
బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల సవరణలపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరగకూడదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బీహార్‌లో ఎన్నోసార్లు ఓటర్ల సవరణ జరిగినా ఈ సారి మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయని అన్నారు.ఇలాంటి సమయంలో భారత ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది? అని ఆయన ప్రశ్నించారు. ఇండియా లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక్క వ్యక్తి తన ఓటు హక్కును కోల్పోయినా.. దానిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
కేంద్రం చెప్పిందని కుటుంబ నియంత్రణను అద్భుతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలు అందుతున్న రివార్డ్.. నియోజకవర్గాల సంఖ్యను తగ్గించడమా? అంటూ చుకలంటించారు. కుటుంబ నియంత్రణలో కేరళ వంటి రాష్ట్రాలు అద్భుతంగా ముందంజలో ఉన్నాయని, వారికి ఇప్పుడు పునర్విభజనలో తక్కువ సీట్లు ఇవ్వడం అన్యాయమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కుటుంబ నియంత్రణను సరిగా అమలు చేయని యూపీ వంటి రాష్ట్రాలకు పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచి దక్షిణాదికి తగ్గిస్తామని చెప్పడం సమాఖ్య వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదని అన్నారు. ఈ అన్యాయాన్ని బీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ కూడా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తి చేస్తున్నాయని ఆయన అన్నారు.