కెటిఆర్ పై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు
మంత్రి నారాలోకేశ్ తో రెండు దఫాలు భేటీ;
By : B Srinivasa Chary
Update: 2025-07-06 15:01 GMT
బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎపిలో టీడీపీ మంత్రి నారాలోకేశ్ తో రహస్య మంతనాలు జరుపుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు బనకచర్ల ప్రాజెక్టు ఆపేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంటే మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం ఏపీ మంత్రి నారా లోకేష్‌తో రహస్యంగా సమావేశమౌతున్నారని అన్నారు. నారా లోకేష్‌తో కేటీఆర్ ఇప్పటికే రెండు సార్లు మంతనాలు జరిపారని ఆరోపించారు. ఎవరికి లబ్ది చేయడానికి మంతనాలు చేశారో కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని సామ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.