KTR |ఈ-కార్ రేస్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ కూడా ఆమోదం తెలిపిన క్రమంలోనే ఏసీపీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన ఈ ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన ఉన్నత న్యాయస్థానం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌గా దీనిని దాఖలు చేయగా దీని విచారణ సింగిల్ బెంచ్ తిరస్కరించింది. దీంతో కేటీఆర్‌కు చిక్కులు తప్పవన్న చర్చ బలంగా జరుగుతోంది. కాగా ఈ పిటిషన్‌ను కేటీఆర్ వెంటనే హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరకు తీసుకుని వెళ్లారు.
ఈకేసుపై కేటీఆర్.. అసెంబ్లీలో మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలతో ఫార్ములా ఈ-కార్ రేసులో ఎటువంటి అవినీతి జరగలేదని స్పష్టమయిందన్నారు. ‘‘హెచ్ ఎండిఏ ఒక కార్పోరేషన్ చట్టంలోనే హైదరాబాద్ నగర ప్రగతికి పనికి వచ్చే ఎ కార్యక్రమానికైన డబ్బులు ఖర్చు చేయవచ్చని ఉంది. హెఎచ్ డి ఎం చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదు.. దానికి అ మేరకు స్వసంత్రత ఉంది. ముఖ్యమంత్రా… లేదా ఇతరులెవరైనా మంత్రులు కొంత మంది సైకోలు తప్పుదొవ పట్టిస్తున్నారో తెలియాలి. లంచ్ మోషన్ పైన కోర్టు తెలుస్తుంది. ఈ కేసుల అణాపైసా అవినీతి లేదు… అయినా ప్రభుత్వం కేసు పెట్టాలని ముందుకు పోతే వాళ్ల ఇష్టం. న్యాయ పరంగా ఎదుర్కుంటాం’’ అని కేటీఆర్ అసెంబ్లీలో అన్నారు.
అయితే బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఏసీబీ పేర్కొంది. అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఏ2గా, హెచ్ఎండీఏ అప్పటి చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఓ శిదేశా సంస్థకు భారీ మొత్తంలో సొమ్ము చెల్లించారంటూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి ఈ ఏడాది అక్టోబర్ 18న ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. దాదాపు రూ.54.88 కోట్ల ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే గురువారం.. తనపై ఏసీబీ కేసు నమోదు చేయడంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను ఇటువంటి కేసులకు భయపడనని అన్నారు.
‘‘ఉద్యమ నాయకుడి బిడ్డలం, కేసులకు భయపడను. ఏసీబీ వారికి కోర్టులో కూడా ఈ కాగితాలు ఇస్తాం’’ అని చెప్పారు. తాము అమృత్ కుంభకోణం సీఎం రేవంత్ రెడ్డి, సోదరుల వ్యవహారాన్ని బయటపెట్టామని తమపై కేసులు పెట్టారని ఆరోపించారు. తాము ఇచ్చిన డబ్బులు ఈ-కార్ రేసింగ్ వద్ద ఉందన్నారు. తాము కేసులకు భయపడేది లేదని, దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. రాజకీయ కేసు కాబట్టి దాన్ని రాజకీయంగా ఎదుర్కొంటామని అన్నారు. అవినీతే లేకపోతే యాంటీ కరప్షన్ ఎక్కడ అని కేటీఆర్ ప్రశ్నించారు. తాము ఇచ్చిన డబ్బులు ముట్టాయని వారు చెప్పారని, అప్పుడు అవినీతి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసు రద్దు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిపైనే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.