ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం.. ఎందుకో చెప్పిన కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు రైతులను వేధిస్తున్నందుకే ఈ నిర్ణయమా..;
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తమ పార్టీ ఆ నిర్ణయానికి రావడానికి ఒక బలమైన కారణం ఉందని కూడా కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రైతులు యూరియా కొరతతో నానాతిప్పలు పడుతున్నారని, వారికి ఆదుకోవాల్సింది పోయే కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు వారిని మరింత వేధిస్తున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ రైతుల గోస తీర్చాలని 20 రోజుల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశామని, కానీ వాటి నుంచి ఇప్పటి వరకు స్పందలేని గుర్తు చేశారు. అందుకే 70 లక్షల రైతన్నల తరుపున ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు కేటీఆర్.
‘‘ఉపరాష్ట్రపతి అభ్యర్థులు ఇద్దరూ కూడా ఎన్‌డీఏ, ఇండి కూటముల ప్రతినిధులు. వాళ్లు వ్యక్తులుగా పోటీ చేయడం లేదు. ఆయా కూటముల తరుపున పోటీ చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు రైతులను వేధిస్తున్నవే. వారి ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లేదు. యూరియా కొరతపై 20 రోజుల క్రితం మేము హెచ్చరించి అప్రమత్తం చేశాం. అయినా స్పందన లేదు. మేము ఎన్‌డీఏ సబార్డినేట్ కాదు.. ఇండి కూటమి సబార్డినేట్స్‌మి కాదు. తెలంగాణ ప్రజల సేవకులం. కావున తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను తెలపానికి దీన్ని వేదికగా వాడుకుంటూ.. రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో పోల్గొనట్లేదు. నోటా ఉండి ఉంటే దానికే ఓటు వేసి ఉండేవాళ్లం’’ అని తెలిపారు కేటీఆర్.