ట్రాన్స్ జెండర్ తో కాపురం కోసం...

ట్రాన్స్ జెండర్ కోసం రాజశేఖర్ భార్య, బిడ్డలను కూడా వదులుకునేందుకు సిద్ధమయ్యాడు;

Update: 2025-07-29 10:02 GMT

కొన్ని కుటుంబాల్లో చిత్ర, విచిత్రాలు జరుగుతున్నాయి. భార్యలను వదిలేస్తున్న భర్తలు, భర్తలను చంపేస్తున్న భార్యల ఘటనలు కామన్ అయిపోయాయి. అయితే తాజాగా జరిగిన ఘటనను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. బంగారం లాంటి భార్య, బిడ్డలను వదిలేసిన ఒక భర్త ట్రాన్స్ జెండర్ తో కాపురం ఉంటున్నాడు. భార్య ద్వారా విషయం రచ్చకెక్కటంతో అందరు భర్తను చూసి ఆశ్చర్యపోతున్నారు.

విషయం ఏమిటంటే జగిత్యాల(Jagityal) పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్ కు లాస్యతో పదేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీళ్ళకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఈమధ్యనే హైదరాబాదుకు చెందిన ట్రాన్స్ జెండర్(Transgender) దీపుతో పరిచయమైంది. పరిచయం కాస్త సన్నిహితంగా మారి చివరకు సహజీవనం చేసేదాకా వ్యవహారం ముదిరిపోయింది. దీపుతో సహజీవనం కారణంగా రాజశేఖర్ భార్య, బిడ్డలను కూడా దూరంపెట్టేశాడు. విషయం తెలుసుకున్న భార్య నచ్చచెప్పేందుకు ఎంత ప్రయత్నించినా భర్త వినిపించుకోలేదు. పైగా ట్రాన్స్ జెండర్ కోసం రాజశేఖర్ భార్య, బిడ్డలను కూడా వదులుకునేందుకు సిద్ధమయ్యాడు. దాంతో లాస్య ఆత్మహత్యాయత్నం చేసింది.

విషయం తెలిసిన చుట్టుపక్కలవాళ్ళు లాస్యను ఆసుపత్రిలో చేర్పించి ఆమె పుట్టింటివాళ్ళు, బంధువులకు కబురుచేశారు. కబురు అందుకున్నవారంతా ఆసుపత్రికి చేరుకున్నారు కాని భర్తమాత్రం రాలేదు. దాంతో మండిపోయిన బంధువుల్లో కొందరు విషయం తెలుసుకుని దీపు ఇంటికి వెళ్ళినపుడు అక్కడే రాజశేఖర్ కనిపించాడు. వెంటనే వాళ్ళున్న గదికి బయట తాళంవేసిన బంధువులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి రాజశేఖర్, దీపులను పోలీసుస్టేషన్ కు తరలించారు. విషయం తెలిసినవారంతా రాజశేఖర్ వ్యవహారం చూసి నవ్వుకుంటున్నారు. చివరకు పోలీసులు ఏమిచేస్తారో చూడాలి.

Tags:    

Similar News