బీసీ రిజర్వేషన్ల అమలు అయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు : పొంగులేటి

క్యాబినెట్ ఆమోదం;

Update: 2025-07-10 16:30 GMT

బిసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ఆర్డినెన్స్ తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించింది. క్యాబినెట్ సమావేశం ముగియగానే సహచర మంత్రులైన జూపల్లి కృష్ణావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కల్సి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి వివరాలను వెల్లడించారు. బిసీ బిల్లు ఆమోదం తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని మంత్రి చెప్పారు. రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన చట్టాన్ని సవరించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఇవ్వాల్టితో కలిపి 19 క్యాబినెట్ భేటీల్లో 321 అంశాలకు క్యాబినెట్ పచ్చ జెండా ఊపిందన్నారు. గత మంత్రి వర్గం ఆమోదించిన అంశాలపై సమీక్ష నిర్వహించామని పొంగులేటి చెప్పారు.

Tags:    

Similar News