మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల
మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాటం వీడాలని నిర్ణయం తీసుకోలేదని జగన్ పేరిట లేఖ
మావోయిస్ట్ పార్టీ శుక్రవారం మీడియాకు లేఖ విడుదల చేసింది. సాయుధ పోరాటాన్ని వీడుతున్నట్లు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదలైన సంగతి తెలిసిందే. అభయ్ ఇచ్చిన స్టేట్ మెంట్ కు తమ పార్టీకి సంబంధం లేదని మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు.
శాంతి చర్చలు జరగాలని ఈ ఏడాది మార్చి నుంచి ప్రతిపాదనలు చేస్తున్నాం, ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి శాంతిచర్చలకు ఆహ్వానించాలని జగన్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర నాయకత్వం అనారోగ్య కారణాల రీత్యా లొంగిపోతున్నట్లు జగన్ స్పష్టం చేశారు. అభయ్ ప్రకటన చేసే ముందు పార్టీని సంప్రదించలేదని, ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపినట్లు జగన్ పేర్కొన్నారు. సాయుధ పోరాటాన్ని త్యజిస్తున్నట్లు అభయ్ చేసిన ప్రకటనను మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్దరహితమన్నారు. మావోయిస్ట్ పార్టీ అధికారప్రతినిధి అభయ్ ఆగస్టు 15న లేఖ విడుదల చేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం అ ర్దరాత్రి ఈ లేఖ జాతీయ, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమ పార్టీ జనరల్ సెక్రెటరీ సంబాల కేశవరావు ఎన్ కౌంటర్ కాకమునుపే శాంతిచర్చలకు ప్రభుత్వం ముందుకు ప్రతిపాదనలు తీసుకువచ్చింది.
ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా వరకు మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని చేసిన అభ్యర్థనమేరకు సాయుధపోరాటాన్ని వీడుతున్నట్టు అభయ్ ప్రకటన చేసిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. మావోయిస్ట్ పార్టీ నేతలతో చర్చించుకోవడానికి నెల రోజులు కాల్పుల విరమణ ప్రకటించాలని అభయ్ చేసిన డిమాండ్ కు పార్టీకి సంబంధం లేదన్నారు.
మావోయిస్ట్ పార్టీ పేరిట వరుస లేఖలు విడుదల కావడంతో ఏది నిజం ఏది అబద్దం అనే సందేహాలు తలెత్తుతున్నాయి.