‘కేసీఆర్ పర్మినెంట్ రెస్ట్ తీసుకుంటే మంచిది’

కేసీఆర్ పాలనను, రేవంత్ రెడ్డి పాలనను పోల్చడం ఆలోచనలేని తనమే అవుతుందని విమర్శించారు మహేష్ కుమార్.;

Update: 2025-02-20 07:08 GMT

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇక పర్మినెంట్ రెస్ట్ తీసుకోవడం మంచిదని సూచించారు. ఆయనకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు అర్థం కావట్లదేని, 14 నెలలు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తికి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం అర్థం కావని, వీటి గురించి కేసీఆర్‌కు వివరించినా చెవిటావాడి చెవిలో శంఖం ఊదినట్లే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ ప్రపంచానికి కనిపించకుండా ఫార్మ్‌హౌస్‌లో దాక్కున్న కేసీఆర్.. ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. ఇకనైనా కేసీఆర్ తన తీరు మార్చుకోవాలని, ఆయన పర్మినెంట్ రెస్ట్ తీసుకుంటే మంచిదని సూచించారు. కానీ ఆయనను ఒక ఉద్యమకర్తగా గౌరవిస్తామని అన్నారు. కేసీఆర్ పాలనను, రేవంత్ రెడ్డి పాలనను పోల్చడం ఆలోచనలేని తనమే అవుతుందని విమర్శించారు మహేష్ కుమార్.

‘‘కేసీఆర్‌కు పగటి కలలు కనడం అలవాటు అయ్యింది. కేసీఆర్ పర్మినెంట్ రెస్ట్ తీసుకుంటే మంచిది. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆదరించారని అనుకోవడం లేదు. బీఆర్ఎస్ పనయిపోయింది. ఫాం హౌజ్‌లో పడుకునే కేసీఆర్ కు అభివృద్ధిని పరుగులు పెట్టించే రేవంత్ కు పోలికా? కేసీఆర్ శఖం ముగిసింది ఉద్యమ నేతగా ఆయనను గౌరవిస్తాం. పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే సత్తా లేని బి.అర్.ఎస్. ఎన్నికల్లో గెలుస్తామనడం విడ్డూరం. ఫాం హౌజ్‌లో పెన్ను పేపర్‌తో గీస్తే గ్రాఫ్ పడిపోతుందా..? 56 శాతం బీసీలు మా వెంట ఉంటే గ్రాఫ్ ఎలా పడిపోతుంది?’’ అని ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎన్నో పనులు చేపట్టిందని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలోనే 56వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్‌లు పగటికలలు కనడం మానుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఉండదు, తండ్రి, కొడుకులు తప్ప ఎవరూ ఉండరు. కవిత, హరీష్ రావు దిక్కులు చూస్తున్నారనీ అందరికీ తెలుసు. ముస్లిం పేరు చెప్పి బీజేపీ లబ్ధి పొందలని చూస్తుంది. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం. 8 నెలల్లో 56 వేల ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ఉంటాం’’ అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

Tags:    

Similar News