మళ్ళీ కేసీఆర్ ని ఇరుకున పెట్టిన మల్లారెడ్డి నిజాయితీ

మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి కేసీఆర్ ని ఇరుకున పెట్టేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఈటలతో ఆయన వ్యవరించిన తీరు..

Update: 2024-04-26 13:08 GMT
Source: Twitter

మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నిజాయితీ పరుడు. ప్రజాసేవ, దేశసేవ, తెలంగాణ సెంటిమెంట్, పార్టీ విధేయత, పార్టీ క్రమశిక్షణ అలాంటివేమీ లేవు. లోపల ఒకటి పైకి ఒకటి మాట్లాడే బాపతు కాదు. రాజకీయాల్లో తానేందుకున్నాడో ఎపుడో చేప్పేశాడు. దానికి ఆయన ముసుగు వేయలేదు. అందుకే మల్లారెడ్డి హృదయం నుంచి వస్తుంది. మంచి వార్త అవుతుంది. ఆపైన వైరలవుతుంది. ఇది పార్టీ నేత కెసిఆర్ ని ఇరుకున పెడుతూ ఉంటుంది. దాన్ని కెసిఆర్ కూడా భరిస్తూ ఉంటాడు. రాజకీయాలకు బిజెనెస్ కు అనుబంధం అలాంటిది.


మఈరోజు మన అభిమాన నేత మల్లారెడ్డి మరోసారి కేసీఆర్ ని ఇరుకున పెట్టేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఈటలతో ఆయన వ్యవరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రత్యర్థి పార్టీ ఎంపీ అభ్యర్థిని కౌగలించుకుని మరీ అన్నా నువ్వే గెలుస్తావ్ అనడం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది. ఆయన కౌగిలించుకున్నది మా మూలు బిజెపి కార్యకర్తనో, నేతనో కాదు, కెసిఆర్ కు బద్దశత్రువయిన అభ్యర్థిని. ఆయన  కాంక్షించాడు. చేశాడు. ఆయన్ని పార్టీ క్రమశిక్షణ అనేది అడ్డుకోలేదు.

శుక్రవారం మల్లారెడ్డి, ఈటల రాజేందర్ ఓ ఫంక్షన్ లో కలిశారు. ఇద్దరు నేతలు ఎదురెదురు పడగానే సంతోషంతో ఆలింగనం చేసుకున్నారు. వెంటనే మల్లారెడ్డి అన్నా నువ్వే గెలుస్తున్నావే అంటూ ఈటలకి షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పారు. ఓల్డ్ ఫ్రెండ్షిప్ కారణంగా మల్లారెడ్డి అలా చెప్పి ఉండవచ్చు. కానీ మల్లారెడ్డి బీఆర్ఎస్ నేత.. ఈటల ఇప్పుడు బీజేపీ పార్టీ మల్కాజిగిరి లోక్ సభ అభ్యర్థి. బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ క్యాండిడేట్ లక్ష్మారెడ్డికి పోటీగా బరిలో నిలుచున్నారు. ఇక అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మల్లారెడ్డి ప్రత్యర్థిని పట్టుకుని నువ్వే గెలుస్తావ్ అనడం అక్కడున్నవారినే కాదు ఆ పార్టీ శ్రేణుల్ని బిత్తరపోయేలా చేసింది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటూ ప్రచారంలో మోత మోగిస్తోంది. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు అని చెప్పుకునే మల్లారెడ్డి లాంటి నేత ఈటలతో నువ్వే గెలుస్తావ్ అని బహిరంగంగా చెప్పడం కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలకి ఊతమిస్తోంది. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న గులాబీ పార్టీని, మల్లారెడ్డి కామెంట్స్ మరింత ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. బీఆర్ఎస్, బీజేపీ ఒకటి కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిపడింది.

ఇంకోవైపు మల్లారెడ్డి బీఆర్ఎస్ లో ఉంటారా, వెళ్ళిపోతారా అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి డిబేట్లు నడుస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఆయన పార్టీలో ఉంటూనే ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ ప్రవర్తించడం పొలిటికల్ పజిల్ లా తయారయ్యింది.

మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేసింది. వెంటనే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి పీఏ వేం నరేంద్ర రెడ్డితో గంటలపాటు చర్చించారు. అప్పుడే కాంగ్రెస్ లో చేరతారు అనుకున్నారు. కానీ జరగలేదు. ఇక అప్పటి వరకు మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ఆయన కొడుకు... లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని కేసీఆర్ చెప్పారు. దీంతో ఎంపీ అభ్యర్థి కోసం కేసీఆర్ కసరత్తు చేయాల్సి వచ్చింది. తొలుత శంబీపూర్ రాజుని ప్రకటించి, తర్వాత ఆ టికెట్ ని ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చారు.

మరోసారి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ తో భేటీ అవడం చర్చనీయంశం అయింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పార్టీలోకి మల్లారెడ్డి ఎంట్రీపై సుముఖంగా లేకపోవడంతో... శివకుమార్ వైపు నుంచి చర్చలు జరిపించేందుకు వెళ్లారని ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం కూడా బీఆర్ఎస్ కి మింగుడుపడనివ్వలేదు. తర్వాత ఆయన పార్టీ మారట్లేదు, చివరి వరకు బీఆర్ఎస్ తోనే ఉంటా కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ చివర్లో ట్విస్ట్ ఇచ్చారనుకోండి.

మూడు రోజుల క్రితం బీఆర్ఎస్ మహిళా గర్జన కార్యక్రమంలో పాల్గొని, కంటోన్మెంట్ ఉపఎన్నిక అభ్యర్థిని గెలిపించాలని స్పీచ్ ఇచ్చారు. ఇక తన స్టైల్లోనే అవతలి పార్టీలపై పంచులూ వేశారు. దీంతో మల్లన్న ఫార్మ్ లోకి వచ్చాడని పార్టీ కేడర్ లో జోష్ పెరిగింది. కానీ, ఇంతలోనే ఈటలని అన్నా... నువ్వే గెలుస్తావే అనేసి, పార్టీ శ్రేణుల్ని బోల్తా కొట్టించారు.

Tags:    

Similar News