పాలమ్మిన మల్లన్నా.. అవి మీ బర్రెలు కాదన్నా...

మల్లారెడ్డి ఏం చేసినా నెట్టింట వీడియోలు వైరల్ అవుతున్నాయి. నవ్వులు పూయిస్తున్నాయి. తాజాగా మల్లారెడ్డి సోషల్ మీడియాకి మరో జోష్ ఫుల్ కంటెంట్ ఇచ్చారు.

Update: 2024-05-10 12:20 GMT

పాలమ్మినా... పూలమ్మినా... బోర్ వెల్ నడిపినా... కష్టపడ్డా... కాలేజీలు పెట్టినా... సక్సెస్ అయినా... ఇది మాజీ మంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సిగ్నేచర్ డైలాగ్. ఆయన చెప్పిన ఈ ఒక్క డైలాగ్ కుర్రకారుని ఉర్రుతలూగించింది. డైలాగ్ కి సంబంధించిన వీడియోలు అన్ని రకాల సోషల్ మీడియా వేదికల్లో కోట్లలో వ్యూస్ తెచ్చాయి. విపరీతంగా వైరల్ అయ్యాయి.

అది మొదలు ఆయన ఏం చేసినా నెట్టింట వీడియోలు వైరల్ అవుతున్నాయి. నవ్వులు పూయిస్తున్నాయి. తాజాగా మల్లారెడ్డి సోషల్ మీడియాకి మరో జోష్ ఫుల్ కంటెంట్ ఇచ్చారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ రైతు గేదెల పాక వద్దకు వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఆయనకి పాలమ్మిన రోజులు గుర్తుకొచ్చాయి కాబోలు. గేదెలకు మేత వేస్తూ వాటితో ముచ్చటించారు. నేనే.. మల్లన్నను.. మీకు ఇంతకుముందు సేవ చేశాను కదా అని వాటికి తనని గుర్తు చేసే ప్రయత్నం చేశారు.

కానీ, ఆయన సాకింది ఆ గేదేలయితే కదా సేవ చేశా అనగానే గుర్తు తెచ్చుకోడానికి. ఆయన ఎప్పుడో 1980 లో పాల వ్యాపారం చేశా అని చెబుతుంటారు. ఆ గేదెలు.. ఈ గేదెలు కాదని పాపం ఆయనకి అక్కడున్నవారు కూడా గుర్తు చేయకపోగా... జేజేలు కొట్టడం విశేషం. ఇలాంటి వీడియోలు బయటకి వస్తే వైరల్ అవ్వవూ... నవ్వులు పూయించావూ...!!

Tags:    

Similar News