మీనాక్షి నటరాజన్ తో భేటీ అయిన మల్లు రవి

వరంగల్ పంచాయతీపై ఆరా;

Update: 2025-06-22 14:46 GMT

కాంగ్రెస్   క్రమశిక్షణా సంఘం చైర్మన్ మల్లు రవి ఆదివారం కాంగ్రెస్ అగ్ర నేత మీనాక్షీ నటరాజన్ తో భేటీ అయ్యారు. గత రెండ్రోజులనుంచి వరంగల్ కాంగ్రెస్ నేతల తో మంత్రి కొండా సురేఖకు కొట్లాట తెలంగాణలో సంచలనమైంది. భద్రకాళీ అమ్మవారి బోనాల విషయంలో మంత్రి కొండా వర్గీయులకు, స్థానిక నేతలతో విభేధాలు తారాస్థాయికి చేరాయి.

వరంగల్ అంశం తన దృష్టికి వచ్చిదని పిసిసి ప్రెసిడెంట్ తో చర్చిస్తానని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇ న్ చార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొస్తానన్నారు. ఈ నెల 24న క్రమశిక్షణా కమిటీ గాంధీ భవన్ లో భేటీ కానున్నట్లు ఆయన తెలిపారు. 

మంత్రి కొండా సురేఖతో విభేధించే కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు.కొండా దంపతులకు వ్యతిరేకంగా తగిన ఆదారాలను మీనాక్షి నటరాజన్ కు చూపించారు. వరంగల్ కాంగ్రెస్ నేతల వివాదం కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది.

Tags:    

Similar News