అమ్మాయి చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్
సుసైడ్ నోట్ లో పెదనాన్న పేరు ఉండటంతో...
By : The Federal
Update: 2025-10-04 14:00 GMT
హైదరాబాద్ పేట్ బషీరాబాద్లో ఇంటర్ విద్యార్థి సుసైడ్ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మృతురాలి పెదనాన్న శ్రీనివాస్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీనివాస్ తమ్ముడు ఆరు నెలల క్రితం చనిపోయాడు. అప్పు తీర్చాలని శ్రీనివాస్ తమ్ముడి కుటుంబాన్నివేధించినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న కుత్బుల్లాపూర్ పోలీసులు తెలిపారు. తమ్ముడి కుమార్తెను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు విచారణలో తేలింది. చనిపోయిన అమ్మాయి సుసైడ్ నోట్ లో పెదనాన్న తన చావుకు కారణం అని పేర్కొనడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.