గంజాయి మత్తులో కారుపైకెక్కి బెదిరింపులు

హైదరాబాద్ మూసాపేటలో చోద్యం;

Update: 2025-07-23 09:49 GMT

యువత మత్తుకు చిత్తవుతుంది. తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న నేరాలకు గంజాయి ప్రధాన కారణం అని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

 గంజాయి మత్తులో ఓ యువకుడు కారు పైకెక్కి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మూసాపేటలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కారు టాప్ పై ఎక్కిన యువకుడు పిడికిలి బిగించి ప్రయాణికులను వార్నింగ్ ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది. యువకుడి చేష్టలకు కారులోని వారు ఒక్కసారిగా నిష్చేష్టులయ్యారు. స్థానికులు వెంటనే యువకుడిని కిందకు దించేశారు. దీంతో కారులోని వ్యక్తులు సేఫ్ గా అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఈ యువకుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

Tags:    

Similar News