టర్కీతో చేసుకున్న ఎంఓయూ రద్దు, మన్నూ వర్శిటీ కీలక ప్రకటన

ఇండో -పాక్ ఉద్రిక్తతల నడుమ టర్కీ పాకిస్థాన్ కు మద్ధతు ఇచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది.;

Update: 2025-05-15 12:21 GMT
హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం

హైదరాబాద్ కు చెందిన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. టర్కీలోని యూనస్ ఎమ్రే ఇన్ స్టిట్యూట్‌తో చేసుకున్న విద్యాపరమైన అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) తక్షణమే రద్దు చేస్తున్నట్లు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. ఇండో-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు టర్కీ మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఉర్దూ యూనివర్శిటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.


2024 జనవరి 2వతేదీన టర్కీలోని యూనస్ ఎమ్రే ఇన్ స్టిట్యూట్‌తో ఐదు సంవత్సరాల కాలానికి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసిందని, దీని కింద మన్నూ లోని స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్, లింగ్విస్టిక్స్ , ఇండాలజీలో టర్కిష్ భాషలో డిప్లొమా ప్రారంభించారు. దీని కోసం విజిటింగ్ ప్రొఫెసర్ల సేవలను ఉపయోగించుకుంటున్నారు. టర్కీ నుంచి వచ్చిన విజిటింగ్ ప్రొఫెసర్ ఇప్పటికే వారి దేశానికి తిరిగి పంపించారని సమాచారం. టర్కీ విద్యా సంస్థతో చేసుకున్న ఒప్పందం రద్దు వల్ల మన్నూ లోని స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్, లింగ్విస్టిక్స్ , ఇండాలజీలో టర్కిష్ భాషలో డిప్లొమా కోర్సులను రద్దు చేశారు.


Tags:    

Similar News