చత్తీస్ గడ్ బీజాపూర్ లో ఎన్ కౌంటర్

మావోయిస్టు దుర్మరణం;

Update: 2025-07-05 10:03 GMT

మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బతగిలింది.

చత్తీస్ గడ్ బీజాపూర్ లో శనివారం ఉదయం నుంచి ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.ఇంద్రావతి నేషనల్ పార్క్ ఆటవీ ప్రాంతంలో మావోయిస్టులకు , భధ్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయినట్టు భధ్రతాధికారులు చెప్పారు. మావోయిస్టు అగ్రనేత సుధాకర్ ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయారు. సుధాకర్ పై కోటి రివార్డు కూడా ఉంది. 2004లో జరిగిన శాంతి చర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు.సుధాకర్ అసలు పేరు టెంతు లక్ష్మి నరసింహాం. అలియాస్ గౌడ్. ప్రస్తుతం సెంట్రల్ కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నారు. ఇతను ఆంధ్ర ప్రదేశ్ ఏలూరు వాసి.జిల్లా ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.


Tags:    

Similar News