సీతక్కకు మేము లేఖ రాయలేదు: మావోయిస్టు పార్టీ

రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట మరో లేఖ;

Update: 2025-07-05 14:20 GMT

మంత్రి సీతక్క ఆదివాసి హక్కులను కాలరాస్తున్నారని ఆరోపిస్తూ కొన్ని రోజుల క్రితం మావోయిస్టులు లేఖ రాసినట్టు ప్రచారంలో ఉంది. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ తెలంగాణ మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. గత నెల 26 వ తేదీన మావోయిస్టు పేరిట వచ్చిన లేఖ తమది కాదని జగన్ క్లారిటీ ఇచ్చారు. అలాగే మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు లొంగిపోయినట్టు వస్తున్న వార్తలను జగన్ ఖండించారు. మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అణచివేత ద్వారా మావోయిస్టుల ఉద్యమం మరింత బలపడుతుందన్నారు.


Tags:    

Similar News