బిచ్కుందలో మరోజత జైన పాదాలు

ఒకప్పడు తెలంగాణలో జైనం వర్ధిల్లిందని తెలపడానికి కొన్ని చారిత్రక ఆధారాలు తాజాగా కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. వీటిని చారిత్రక పరిశోధక బృందం కనుగొంది

Update: 2024-03-05 08:58 GMT

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం శివారులో భూమిలో పాతివున్న ఆరడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పైన రాతిపాదాలజతను బృందం చారిత్రక పరిశోధకుడు బొగ్గుల శంకరరెడ్డి గుర్తించాడు. ఈ పాదాలు పాదాభరణాలతో అలంకరించబడి వున్నాయి. ఎవరో దేవత పాదాలని ప్రజలు పూజలు చేస్తున్నారు. ఈ పాదాలను పోలిన పాదాలు మహబూబ్ నగర్ జిల్లా గొల్లత్తగుడి వెనక పాదాలగడ్డలో, భైంసాలో, కొలనుపాక సోమేశ్వర దేవాలయ ప్రాంగణంలో, మహారాష్ట్రలోని కాంధార్ లో ఉన్నాయి.

అవన్నీ జైనధర్మక్షేత్రాలే. వాటిని జైన తీర్థంకరుల పాదాలుగానే చరిత్రకారులు గుర్తించారని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వివరించాడు. బిచ్కుందలో అగుపించిన పాదాలు కూడా జైనధర్మశిల్ప సంబంధమైనవే. బిచ్కుందలో జైనమత చివరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుని విగ్రహానికి చెందిన అధిష్టాన పీఠం కూడా ఆ పరిసరాల్లోనే లభించింది. ఇవి జైన తీర్థంకరుల భారీ విగ్రహాలకు చెందిన పాదాలై వుంటాయనిపిస్తుంది. కాంధార్ లో జైన తీర్థంకరుల పెద్ద శిల్పాల భాగాలు కూడా మ్యూజియం వద్ద కనిపిస్తాయి. అందువల్ల ఈ పాదాలు బాహుబలి విగ్రహంవంటి ఎత్తైన శిల్పాలవై వుండవచ్చుననిపిస్తున్నది.



Tags:    

Similar News