మెట్రో ఛార్జీలు తగ్గాయోచ్..
రేట్ల సవరణ అన్ని జోన్స్‌లో మే 24 నుంచి అమ్మలోకి వస్తుందని మెట్రో వెల్లడించింది.;
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఛార్జీలను పెంచుతూ షాకిచ్చిన మెట్రో యాజమాన్యం.. ఇప్పుడు ఆ రేట్లను సవరించినట్లు ప్రకటించింది. పెంచిన ఛార్జీలు అధికభారం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పెంచిన ఛార్జీలను 10శాతం తగ్గిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం ఎక్స్(ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. ఈ రేట్ల సవరణ అన్ని జోన్స్‌లో మే 24 నుంచి అమ్మలోకి వస్తుందని మెట్రో వెల్లడించింది.
ఇటీవల పెంచిన ఛార్జీలిలా
రెండు నుండి 4 స్టాపుల వరకు రు. 18 రూపాయలు.
4 నుండి 6 స్టాపులవరకు రు. 30
6 నుండి 9 స్టాపుల వరకు రు. 40
9 నుండి 12 స్టాపుల వరకు రు. 50
12 నుండి 15 స్టాపుల వరకు రు. 55
15 నుండి 18 స్టాపుల వరకు రు. 60
18 నుండి 21 స్టాపుల వరకు రు. 66
21 నుండి 24 స్టాపుల వరకు రు. 70
24 స్టాపుల..ఆపై వరకు రు. 75 ఛార్జీ ఉంటుంది.