Konda Surekha | మరో వివాదంలో కొండా సురేఖ పేరు.. ఈసారి ఏమైందంటే..!

వేములవాడ రాజన్న ఆలయ కోడెల వివాదంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేరు వినిపిస్తోంది. ఆమె సూచనల మేరకే అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి.;

Update: 2024-12-07 07:16 GMT

తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇన్ని రోజులు నాగార్జున ఫ్యామిలిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆమె వ్యాఖ్యలకు గానూ నాగార్జున సహా మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అవి ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణలో ఉన్నాయి. ఇంతలోనే మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ పేరు గట్టిగా వినిపిస్తోంది. అదే మేములవాడ రాజన్న కోడెల వివాదం. ఇందులో కొండా సురేఖ హస్తం ఉందని, ఆమె అనుమతితోనే అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. రాజన్న కోడెల పంపిణీ విషయంలో ఆలయ ఈఓ వినోద్ రెడ్డి ఒంటెద్దు పోకడ పోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోడెలు దారితప్పుతున్నాయంటూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులోనే ఈ అక్రమాలు వెలుగు చూశాయి. కాగా ఇప్పుడు మంత్రి కొండా సురేఖ సూచనలమేరకే ఈ అక్రమాలు జరుగుతున్నాయని, ఆగస్టు నెల 12వ తేదీన రాంబాబు అనే వ్యక్తికి అధికారులు 49 కోడెళ్లను అందించడం కూడా మంత్రి సూచన మేరకే జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మంత్రి మెప్పు కోసమే..

అయితే సదరు మంత్రిని మెప్పించడం కోసం, ఆమె అనుయాయుడు అనిపించుకోవాలన్న తాపత్రయంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డరాని, అందులో భాగంగానే ఆలయ కోడెళ్లను నిబంధనలకు విదరుద్దంగా అప్పగించారన్న విమర్శలు వినిపిస్తున్నారు. రైతులకు నామమాత్రంగా రెండు మూడు కోడెళ్లను అందించింది. రాంబాబు అనే వ్యక్తికి మాత్రం 49 కోడెళ్లను ఇవ్వడం ప్రస్తుతం తెలంగాణ అంతటా వివాదాస్పదంగా మారింది. కాగా కోడెళ్లను తాను టెండర్ ద్వారా పొందానని రాంబాబు అనే వ్యక్తి ఇప్పటికే పోలీసులకు వెల్లడించారు. ఈ క్రమంలోనే మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

భక్తుల మండిపాటు

పశువుల వ్యాపారి అయిన మంత్రి అనుచరుడు రాంబాబుకు.. 49 కోడెళ్లను అనధికారికంగా కట్టబెట్టడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఒకే వ్యక్తికి భారీ సంఖ్యలో కోడె దూడలను కేటాయించడంపై సమగ్ర విచారణ జరిపించాలని హిందూ సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కోడెల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అంతేకాకుండా కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మంత్రి కొండా సురేఖ ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News