ఫ్లోర్ లీడర్లకు పొన్నం ప్రభాకర్ లేఖ..

గవర్నర్‌ను కలవడానికి కలిసి రావాలని కోరిన మంత్రి.;

Update: 2025-08-31 12:41 GMT

తెలంగాణలోని అన్ని పార్టీలో అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. కేటీఆర్, హరీష్ రావులను కూడా వారి ఛాంబర్లకు వెళ్లి కలిసి మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు అంశంపై గవర్నర్ కలవడానికి అంతా కలిసి రావాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ విషయాన్ని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్రపతి, ప్రధాని తమ అపాయింట్‌మెంట్‌లను కూడా ఎప్పటికప్పుడు కోరుతున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే గవర్నర్ కలిసి ఈ బిల్లుకు ఆమోదం ఎంత ముఖ్యమో వివరిస్తామని, ఈ అంశం ఒక కొలిక్కి వస్తే స్థానిక సంస్థల ఎన్నిలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. గవర్నన్‌ను కలిసి తమ విధానం తాము చెప్తామని, ఇక తుది నిర్ణయం ఆయన చేతిలోనే ఉంటుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

‘‘న్యాయపరంగా అన్ని అంశాలు తెలుసుకునే ఈ నిర్ణయానికి వచ్చాం. సభలో అందరికీ ఏకాభిప్రాయం ఉన్న విషయాన్ని కూడా గవర్నర్‌కు వివరిస్తాం. దానిని పరిగణనలోకి తీసుకోవాలని కోరతాం. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే ఎన్నికలకు వెళ్తాం. నేను లా-సెట్ చేశాను. ప్రాక్టీస్ చేయలేద అంతే. విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచే ఈ సమస్యపై అవగాహన ఉంది. నాకేం అవగాహన లేకుండా మాట్లాడట్లేదు. ప్రజాస్వామ్యంలో చట్టసభలే ఫనల్ కదా.. మూడ్ ఆఫ్ ది హౌస్‌ను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని గవర్నర్‌ను కోరుతాం.

Tags:    

Similar News