Sridhar Babu | నూతన భవనాల డ్రాయింగ్ స్క్రూటినీకి సరికొత్త యాప్..

రాష్ట్రంలో నూతన సమగ్ర భవనాలు, లేఅవుట్ల ఆమోదానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘బిల్డ్ నౌ’ అనే వ్యవస్థను తీసుకొచ్చింది.

Update: 2024-12-03 10:39 GMT

రాష్ట్రంలో నూతన సమగ్ర భవనాలు, లేఅవుట్ల ఆమోదానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘బిల్డ్ నౌ’ అనే వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ వ్యవస్థకు సంబంధించి సరికొత్త యాప్‌ను మంత్రి శ్రీధర్ బాబు.. సెక్రటేరియట్‌లో ఈరోజు ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా నూతన భవనాల అనుమతులు, డ్రాయింగ్ స్క్రూటినీని వేగంగా పూర్తి చేయొచ్చని ఆయన చెప్పారు. ఇది అత్యాధునిక ప్రజాపాలన దిశగా ఒక విప్తవాత్మక అడుగు వేయడమేనని అన్నారు. దేశంలో అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూట్నీ వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ‘బిల్డ్ నౌ’ యాప్ ఒక్కటేనని తెలిపారు. సాధారణంగా అనుమతులు, డ్రాయింగ్ స్క్రూటినీకి వారాల సమయం పడితే, ఈ వ్యవస్థ ఆ సమయాన్ని నిమిషాలకు తగ్గిస్తుందని, ఈ వ్యవస్థ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందని అన్నారు.

ఐదే ఐదు నిమిషాలు

‘‘కొత్త 3d టెక్నాలజీ సహాయంతో బిల్డ్ నౌ పేరుతో బిల్డింగ్ శాంక్షన్ ప్రక్రియ. రోజులు తరబడి జరిగే అప్రూవల్ ప్రాసెస్ బిల్డింగ్ టెక్నాలజీతో ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది. పెద్దపెద్ద భవనాలు ఫ్లాట్స్ మోడల్‌ను త్రీడీలో వీక్షించే అవకాశం. వివిధ రకాలైన ప్రభుత్వ అనుమతులను కూడా బిల్డ్ నౌ టెక్నాలజీతో అనుసంధానం చేయనుంది ప్రభుత్వం. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఎంతో ఉపయోగకరంగా బిల్డ్ నౌ మారనుంది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో బిల్డ్ నౌ టెక్నాలజీ సేవలు అందించనుంది. బిల్డింగ్ డ్రాయింగ్, పర్మిషన్ ఇతర డాక్యుమెంట్‌లు అన్నీ ఒకే దగ్గర వెంటనే డౌన్ లోడ్ చేసి చూసుకునే అవకాశం’’ అని శ్రీదర్ తలెలిపారు.

‘‘గత సంవత్సరం ఇదే రోజు ఎన్నికలకు సంబంధించి ప్రజలకి సమాచారం అందిస్తున్న సమయం.. సరిగ్గా ఇదే రోజు మేము జబాబు దారితనంతో మేము ఏం చేశాము అని వివరిస్తున్నాం. పురపాలక శాఖ సంబంధించి ఈ సంవత్సర కాలంలో ఏం చేశాం ఏం చేయబోతున్నము. దాదాపు 60%పట్టణ ప్రాంతాల్లో ఉన్నందున స్వయానా ముఖ్యమంత్రి ఈ శాఖ’’ అని పేర్కొన్నాం.

శ్రీధర్ బాబు ఇంకా ఏమన్నారంటే..

పీసీఐ వేగంగా పెరుగుతుంది

రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికీ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది

బెంగళూర్ కన్నా మన దగ్గర 467 మంది UHAI ఉన్నారు

గ్రేటెడ్ హైదరాబాద్లో ఇల్లు ఎక్కువగా కొంతున్నారు..నిర్మాణ రంగం దూసుకొని పోతుంది...హోమ్ లోన్స్ మన దగ్గర ఎక్కువగా తీసుకున్నారు....

ఐటీ రంగం లో 45000 జాబ్స్ ...దాదాపు 10 లక్షల మంది ఐటీ రంగంలో పని చేస్తున్నారు

దేశంలో ఈరోజు 21% గ్లోబబుల్ సెంటర్లు హైదరాబాద్లో ఉంది

1.30 వేల రెసిడెన్సీయల్ కూడా కావాలి అని ...

2024 న్యూ బిల్డింగ్ అండ్ లే అవుట్ పర్మిషన్లు పెరిగియాయి

హైదరాబాద్ నగరానికి సంబంధించి సస్టెయినబుల్ డెవలప్మెంట్ కావాలి అని

నగరాలకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చే సంస్థ సావిల్స్ గ్రో హబ్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ నగరం ప్రపంచలోనే టాప్ 5 ఉంది ....ప్రపంచంలోనే మొదటి స్థానం రావాలి అని అనేక కార్య్రమాలు కు శ్రీకారం చుట్టడం జరిగింది

ఆన్లైన్ నూతన భవన మరియు లేఅవుట్ సంభంధించిన వ్యవస్థను ప్రవేశ పెట్టాము

డ్రాయింగ్, స్కూటిని ప్రొపెస్ లేట్ అవుతుంది అని మా దృష్టికి తీసుకొని రావటం జరిగింది...వినియోగ దారుల కు వారాల నుండి నిమిషాల వ్యవధికి తగ్గించడానికి బిల్డ్ నౌ ను ప్రవేశ పెట్టటం జరిగింది

ఇది భవన నిర్మాణానికి అవసరమైన సమాచారాన్ని మరియు అనుమతులను, వివరాలను వేగంగా పొందవచ్చు

3D టెక్నాలజీ ద్వారా ప్రజలు తమ భవనాన్ని నిర్మాణం ముందే అగ్మెంటెడ్ విసువలైజేషన్ ద్వారా చూడవచ్చు

ఎవరైనా టాపరింగ్ చేయాలన్న చేయలేరు...మరియు ఇది పబ్లిక్ డొమైన్ ఉంచబడుతుంది అని ఆయన తెలిపారు.

Tags:    

Similar News