గచ్చిబౌలిలో ఘనంగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం

72 వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ దేశాల అందాల భామలు వారి దేశాల పతకాలను చేతపట్టుకొని మెరిశారు.;

Update: 2025-05-10 16:13 GMT
మిస్ వరల్డ్ పోటీల్లో మెరిసిన అందాల భామలు

ప్రపంచ శాంతికి, ఐక్యతకు మిస్ వరల్డ్ పోటీలు కూడా పాటుపడతాయని నిర్వాహకులు ప్రకటించారు.తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో కార్యక్రమం సాగింది. చివరలో మిస్ వరల్డ్ పోటీల ప్రారంభంలో అన్ని దేశాల ప్రతినిధులు గొంతు కలిపిన గీతాలాపన చేశారు.హైదరాబాద్ గచ్చిబౌలిలో మిస్ వరల్డ్-2025 పోటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం అయినట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ ప్రకటించారు.




 మిస్ ఇండియాకు కరతాళధ్వనులు

మిస్ ఇండియాకు కరతాళ ధ్వనులతో ఆహుతులు స్వాగతం పలికారు. చప్పట్లతో స్టేడియం దద్దరిల్లింది. తమ తమ జాతీయ జెండాలు చేతపట్టి ఒకేసారి 110 దేశాలకు చెందిన అందాల భామలు ర్యాంపు పైకి వచ్చారు. మూడు రంగుల జెండాతో చివరగా వారితో చేరిన మిస్ ఇండియా నందిని గుప్తా అందరినీ ఆకట్టుకుంది.మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అందాల భామతో కరచాలనం చేశారు. మిస్ నేపాలి చీర కట్టుతో ర్యాంపు పైకి వచ్చి అందరినీ ఆకర్షించింది.



 తెలంగాణ గీతాలాపనతో ప్రారంభం

చివరి రౌండ్ కంటెస్టెంట్స్ ఆసియా ఓషియానియా ర్యాంపు పైకి వచ్చారు. ఈ ప్రారంభ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,హైదరాబాద్ నగరం మేయర్ విజయలక్ష్మి మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్ క్రిష్టినా తదితరులు పాల్గొన్నారు. 250 మంది కళాకారులతో కన్నుల పండువగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం అయ్యాయి. పేరిణి నృత్య ప్రదర్శించారు. అందె శ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో ప్రారంభమైన 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కావడం విశేషం.



 ర్యాంపుపై మెరిసిన అందాల భామలు

కరేబియన్ లాటిన్ అమెరికా తో పోటీదారులు రాక మొదలయింది. మొదట అర్జెంటీనా అందాల భామ ర్యాంప్ పైకి వచ్చారు.మిస్ వరల్డ్ ప్రారంభ సమావేశంలో తమ దేశీయ ఆహార్యంతోపాటు ఆయా దేశాల సంస్కృతి, సాంప్రదాయ వేషధారణలతో అలరించిన లాటిన్ అమెరికా దేశాల సుందరీమణులు వచ్చారు.రెండవ రౌండ్ కంటెస్టెంట్స్ ఆఫ్రికా ఖండం నుంచి అంగోలా తో మొదలైంది. తమ దేశీయ ఆహార్యంతోపాటు తమ దేశాల సంస్కృతి, సాంప్రదాయ వేష దారణలతో అలరించిన ఆఫ్రికన్ దేశాలకు చెందిన 22 దేశాల కాంటెస్టర్లు వచ్చారు. ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది.జాతీయ జెండాను చేతబూనిన కళాకారులు అద్భుత ప్రదర్శన చేశారు.మూడవ రౌండ్ కంటెస్టెంట్స్ యూరప్ ఖండం నుంచి అల్బేనియా ప్రతినిధితో మొదలైంది. మొత్తం 32 దేశాలు యూరప్ నుంచి ప్రాతినిధ్యం వహించాయి. వారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించారు.మిస్ ఇండియా నందిని గుప్తా వచ్చినపుడు కరతాళ ధ్వనులతో స్టేడియం మారుమోగింది.సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న సైనికులకు వారి ధైర్య సాహసాలకు మిస్ వరల్డ్ నిర్వాహకులు సెల్యూట్ చేశారు.తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయమని కంటెస్టెంట్స్ ను జయేష్ రంజన్ కోరారు.


Tags:    

Similar News