మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు తీవ్ర అస్వస్థత

హైదరాబాద్ పర్యటనలో ఉన్న మిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

Update: 2024-09-09 13:17 GMT

హైదరాబాద్ పర్యటనలో ఉన్న మిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పర్యటనలో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న కంభంపాటి హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయనను ఏర్పాటు నుంచి గచ్చిబౌలిలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. తరలిస్తున్న సమయంలో ఎయిర్పోర్ట్ నుంచి ఆసుపత్రి వరకు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కాగా, కంభంపాటి హరిబాబు ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేసి 1993లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1977లో జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా సేవలందించారు. 1978లో జనతా యువమోర్చాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 1991-1993 కాలంలో హరిబాబు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా పనిచేశారు.

తర్వాత 1993 - 2003 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా కొనసాగారు. 1991లో విశాఖపట్నం-1 నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యునిగా ఎన్నుకోబడ్డారు. 2003 ఆంధ్రప్రదేశ్ శాసనసభలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గా కొనసాగారు. కంభంపాటి హరిబాబు 2014 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి బిజెపి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014 నుంచి 2019 వరకు ఏపీ రాష్ట్రానికి బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు. 2021 జులై 6న మిజోరం రాష్ట్ర గవర్నర్ గా నియమించబడ్డారు. 

Tags:    

Similar News