MLA Madhavarm Krishna Rao | ‘కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు కష్టం రాకూడదు’

తెలంగాణలో కళ్యాణ లక్ష్మీ పథకం అమలుపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘాటుగా స్పందించారు.

Update: 2024-11-25 07:43 GMT

తెలంగాణలో కళ్యాణ లక్ష్మీ(Kalyana Lakshmi) పథకం అమలుపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishnarao) ఘాటుగా స్పందించారు. కళ్యాణ లక్ష్మీ పథకం లబ్ధిదారులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని, సమయానికి పథకానికి సంబంధించిన చెక్కులు పంపిణీ అయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు. మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ అని అధికారులు చెప్పడం సరైన పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రావడం ఇబ్బందికరంగా అనిపిస్తుంటే అధికారులే సరైన సమయంలో చెక్కులు అందించేయాలని అన్నారు. ఏది ఏమైనా లబ్ధిదారులను కష్టపెడితే మాత్రం ఊరుకునేది లేదని అన్నారాయన. మంగళవారం ఉదయం 11 గంటల కల్లా ప్రతి ఒక్కరికీ కళ్యాణ లక్ష్మీ పథకం చెక్కులు అందించాలని, లేని పక్షంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారాయన.

550 మందికి అందని కళ్యాణ లక్ష్మీ

‘‘కూకట్ పల్లి నియోజక వర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేశారు. మంత్రి చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేస్తామని అధికారులు నెల రోజులుగా చెప్పుతున్నారు. కానీ ఇప్పటి వరకు మంత్రి రాలేదు. ఎప్పుడు వస్తారో కూడా తెలీదు. ఆయన వచ్చే వరకు చెక్కులు ఇవ్వలేమంటూ ఆపేయడం ఎంత వరకు సమంజసం. చెక్కులు ఇప్పించాలంటూ లబ్ధిదారులు ఎమ్మెల్యేగా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేసే ఆనవాయితీ ఉంది. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం మంత్రి వస్తేనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అంటున్నారు. నెల రోజులుగా కలెక్టర్, ఆర్డిఓ , ఏంఆర్ఓలు, పలుమార్లు ఫోన్ చేసిన మంత్రి వస్తనే పంపిణీ అనే సమాధానం చెప్పడం సరైన పద్ధతి కాదు. ఎమ్మెల్యే రావడం అధికారులకు ఇబ్బంది అయితే అధికరులే పంపిణీ చేయండి’’ అని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు.

Tags:    

Similar News