ఎంఎల్సీ ఎన్నిక కిషన్ నాయకత్వానికే పరీక్షా ?
బుధవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ జరుగుతుంది;
హైదరాబాద్ జిల్లా ఎంఎల్సీ ఎన్నికకు రంగం సిద్ధమైపోయింది. బుధవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగులో 112 మంది ఓటుహక్కుంది. అయితే ఎంతమంది ఓటుహక్కును వినియోగించుకుంటారో చూడాలి. ఎందుకంటే 24 ఓట్లున్న బీఆర్ఎస్(BRS) ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ ఓట్లకు బీజేపీ(BJP) గాలమేస్తోంది. కాబట్టి బీఆర్ఎస్ ఓటర్లు ఎంఎల్సీ ఎన్నికలో పాల్గొనే విషయంలో సస్పెన్స్ కంటిన్యు అవుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) హెడ్ ఆఫీసులోనే పోలింగ్, కౌంటింగ్ జరిపేందుకు ఎన్నికల కమీషన్ అన్నీ ఏర్పాట్లుచేసింది. 25వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. మహాయితే ఒక గంటలోపే ఫలితం తేలిపోతుంది. అందరు ఊహించినట్లుగా ఎంఐఎం గెలుపు గ్యారెంటీనే. కాకపోతే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) వల్లే ఈ ఎన్నికపై కాస్త ఆసక్తి పెరిగిందంతే. ఏకగ్రీవంగా ఎంఐఎంకు సీటును ఎందుక అప్పగించాలన్న ఆలోచనతోనే బీజేపీ గౌతమ్ రావును పోటీలోకి దింపింది. ఎంఐఎం మిత్రపక్షం కాబట్టి కాంగ్రెస్(Congress) ఈ సీటును అప్పగించేసింది. దాంతో ఈ సీటులో ఎంఐఎం అభ్యర్ధి ఏకగ్రీవమని అందరు అనుకుంటున్న సమయంలో బీజేపీ సడెన్ గా అభ్యర్ధిని ప్రకటించింది కాబట్టి ఎన్నిక అనివార్యమైంది.
ఈ ఎన్నికల్లో హైదరాబాద్(Hyderabad) జిల్లాలో మాత్రమే ఉండే కార్పొరేటర్లు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలు మాత్రమే ఓటర్లు. అందుకనే ఎంఐఎం బలం 50గా ఉంది. బీజేపీకి 24 ఓటర్లున్నారు. బీఆర్ఎస్ కు కూడా 24 ఓటర్లున్నాయి. కాంగ్రెస్ కు 14 ఓట్లున్నారు. కాంగ్రెస్, ఎంఐఎం మిత్రపక్షాలు కాబట్టి రెండుపార్టీల బలం 64 ఓట్లు. ఏ విధంగా చూసినా బీజేపీ గెలుపు అవకాశంలేదు. బీఆర్ఎస్ నుండి మొత్తం అన్నీఓట్లను చీల్చుకున్నా బీజేపీ+బీఆర్ఎస్ ఓట్లు 48 అవుతాయే కాని 64 అయితే కాలేందు. అయినా పోటీపెట్టి రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించటమే కిషన్ రెడ్డి ఎత్తుగడగా ఉన్నది చూస్తుంటే. చూద్దాం రేపటి పోలింగ్ లో ఏమవుతుందో.