యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలు.. వెల్లడించిన కేంద్రమంత్రి

తెలంగాణలో ఎంఎంటీఎస్ సేవల పరిధిని పెంచడంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు.

Update: 2024-10-20 10:29 GMT

తెలంగాణలో ఎంఎంటీఎస్ సేవల పరిధిని పెంచడంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎంఎంటీఎస్ సేవలను హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా వాటిని యాదాద్రి వరకు పొడిగించనున్నట్లు తెలిపారాయన. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను సందర్శించారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్. ఈ సందర్బంగానే ఆయన ఎంఎంటీఎస్ సేవలను గురించిన ప్రస్తావన తీసుకొచ్చారు. అతి త్వరలోనే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను పొడిగించే పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో నిర్మించినట్లు చెప్పారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరవ్ాత నుంచి తెలంగాణకు రైల్వేల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ లోటును పూడ్చడం కోసం బీజేపీ శ్రమిస్తుందని వివరించారు. నూతన రైల్వే లైన్ల నిర్మాణ విషయంలో కేంద్రం ఏమాత్రం అడుగు వేయడం లేదని, ప్రతి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వివరించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో సికింద్రబాద్, నాంపల్లి, కాచిగూడతో పాటు అతి త్వరలో చర్లపల్లి కూడా నూతన అదనపు రైల్వేషన్‌గా రాబోతుందని, దీని వల్ల హైదరబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

చర్లపల్లి కోసం రూ.430 కోట్లు

‘‘ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలోని రైల్వేస్టేషన్‌లు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను‌ కూడా అనుకున్న దాని కంటే తక్కువ సమయంలోనే నిర్మించాం. చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ కోసం రూ.430 కోట్లు ఖర్చు చేశాం. రైల్వే ట్రాక్ నిర్మాణంతో పాటు సరికొత్త టెక్నాలజీతో అన్ని సదుపాయాలు కల్పించాం. దివ్యాంగులకు, వృద్ధులకు పైఅంతస్తులకు వెళ్లడం కోసం ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు నిర్మించాం. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి వెళ్లడం కోసం రోడ్ల కనెక్టివిటీని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి. భరత్ నగర్, మహాలక్ష్మీ నగర్ వైపు 80 అడుగుల మేర రోడ్లు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రాతిపదిక వీటిని ఏర్పాటు చేయాలి. దీని కోసం తెలంగాణ సర్కార్ మాస్టర్ ప్లాన్‌ను తయారు చేసింది. దానిన వెంటనే అమలు చేయాలి. ఇక్కడి నుంచి పూర్తి స్థాయి రోడ్ల కనెక్టివిటీ ఉంటేనే రైల్వే స్టేషన్‌తో పూర్తి ఉపయోగం ఉంటుంది. లేకుంటే ఎంత సరికొత్త టెక్నాలజీతో నిర్మించినా ఈ రైల్వేస్టేషన్ పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించలేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

తెలంగాణకు కవచ్

‘‘తెలంగాణలో రైల్వే ప్రమాదాలను నియంత్రించడం కోసం ఇక్కడ కూడా రైల్వే కవచ్ సాంకేతికతను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాం. ఇందుకు ప్రధాని ప్రత్యేక ధన్యవాదాలు. వందేభారత్ రైళ్లు ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే అధిక సంఖ్యలో ఉన్నాయి. అతి త్వరలోనే వందేభారత్ రైళ్లలో కూడా స్లీపర్ కోచ్‌లను అందుబాటులోకి తెస్తాం. తెలంగాణలో అమృత్ పథకం కింద 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ.715కోట్లతో, నాంపల్లి స్టేషన్‌ను రూ.429కోట్లతో, చర్లపల్లి స్టేషన్‌కు రూ.430కోట్లు ఖర్చు చేయనున్నాం. ఈ అభివృద్ధి పనుల కోసం రూ.521 కోట్లతో రైల్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్ ప్రారంభించాం’’ అని చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి.

Tags:    

Similar News