బనకచర్ల పై నారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పొట్టివాడు గట్టివాడని రేవంత్ పై వ్యాఖ్య;
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బనకచర్ల ఎలా కడతారని సిపిఐ జాతీయ కార్యదర్శి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు.
బనకచర్ల ఇప్పుడు ప్రాధాన్య అంశం కాదు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తైన తర్వాతే బనకచర్ల గూర్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించాలన్నారు.రేవంత్ రెడ్డితో చర్చించకుండా బనకచర్ల ప్రాజెక్టు కట్టాలని చంద్రబాబు ఎలా నిర్ణయం తీసుకుంటారని నారాయణ ప్రశ్నించారు. ప్రాజెక్టులను వివాద రహితంగా కట్టుకోవాలి. రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేలిన తర్వాతే నీటిపారుదలా ప్రాజెక్టులు కట్టుకోవడం శ్రేయస్కరమని ఆయన అన్నారు. నీళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం శ్రేయస్కరం కాదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల చేత ఎన్నుకోబడ్డ నేత. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి అన్యాయం చేయలేదు. పొట్టి గట్టివాడు అని రేవంత్ రెడ్డిని నారాయణ కొనియాడారు.