తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ, మంత్రి పొన్నం వెల్లడి
తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కొత్త ఈవీ పాలసీ అమలు చేస్తున్నామన్నారు.
By : The Federal
Update: 2024-11-17 11:51 GMT
తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిస్తున్నట్లు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని ఆయన వెల్లడించారు. ఢిల్లీ నగరంలోలాగా హైదరాబాద్‌లో కాలుష్యం సమస్య తలెత్తకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
రవాణశాఖలో కీలక మార్పులు
తెలంగాణలో రవాణా శాఖ పరంగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్య తెచ్చే కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పొన్నం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో హైదరాబాదు ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి ప్రకటించారు.గతంలో 2020-2030 ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చారని, జీవో నెంబర్ 41 ద్వారా 2026 డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందని చెప్పారు.
కాలుష్య రహితంగా హైదరాబాద్
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి లేదని, కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మార్చాలని ప్రణాళికలు తీసుకువచ్చామని మంత్రి పొన్నం చెప్పారు.ఎలక్ట్రిక్ బస్సులు కొన్నట్లైతే , కార్లు ఆర్టీసీ బస్సులు , సంస్థల బస్సులు 100 శాతం టాక్స్ మినహాయింపు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు. ఆదివారం హైదరాబాద్ లో 83 పఠాన్ చేరు 72 కాలుష్యం ఉందని,కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవి పై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని మంత్రి చెప్పారు.
హైదరాబాద్ లో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ లో ఇప్పుడున్న మూడు వేల బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మంత్రి పొన్నం వెల్లడించారు. త్వరలోనే సిటీ లో మొత్తం ఆర్టీసీ బస్సులు నడుస్తాయన్నారు. హైదరాబాద్ జీహెచ్ ఎంసీ మాత్రమే కాకుండా తెలంగాణ మొత్తం ఈవి పాలసీ ఉంటుంది
ఇక వాహనాలకు కాలుష్య పరీక్షలు
ఈవీ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నానని మంత్రి చెప్పారు. భవిష్యత్ తరాలకు కాలుష్యం నుంచి నివారించండి అని కోరారు. వాహనాలు 15 సంవత్సరాల దాటిన వాటికి స్క్రాప్ చేయాలనే పాలసీ తెచ్చాన్నారు. ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్ తెస్తున్నామని,వాహనదారులు పొల్యూషన్ టెస్ట్ చేసుకునేలా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.
రోడ్డు సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు
దేశంలో లక్ష 50 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని,తెలంగాణ లో రోజుకు 20 మంది చనిపోతున్నారని మంత్రి తెలిపారు.రోడ్ సేఫ్టీ పై గురువా రెడ్డి సంస్థ లైసెన్స్ ఇచ్చే ముందే అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుందన్నారు.యునిసెఫ్ ద్వారా స్కూళ్లలో రోడ్డు అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘‘రవాణా శాఖ కు కొత్త లోగో వస్తుంది..కొత్త వాహనాలు వస్తున్నాయి .ఎన్ఫోర్స్ మెంట్ కి చెడ్డ పేరు రాకుండా ఉండాలి..రవాణా శాఖ లో పలు సంస్కరణలు తీసుకొస్తున్నాం..రేపటి నుంచి ఎలక్రిక్ వాహనాలు అన్ లిమిటెడ్ గా కొనుక్కోవచ్చు’’ అని మంత్రి పొన్నం చెప్పారు.