తెలంగాణలో దొరికిన ఆదిమ మానవుడి రాతి మచ్చుకత్తి

తెలంగాణలో ఎటూచూసినా పురాతన మానవుడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అవి మాయం కాకముందే రికార్డు చేసేందుకు తెలంగాణ చరిత్ర బృందం పనిచేస్తూ ఉంది.

Update: 2023-12-29 06:24 GMT
కొత్త రాతియుగపు మచ్చుకత్తి తెలంగాణలో కనిపించింది


కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు అహోబిలం కరుణాకర్ ఆదిమ మానవుడి మచ్చుకత్తి కనుగొన్నారు. 

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని ఉమ్మాపూర్ గ్రామం పాటిగడ్డ మీద  ఈ రాతి మొద్దు కత్తిని గుర్తించాడు. ఆయన పరిశీలించిన ప్రదేశానికి  సమీపంలో పెద రాతియుగం సమాధులున్నాయి.




 పురామానవులు వేటాడిన జంతువులను కోసుకుని తినడానికి, ముక్కలుగా నరకడానికి వాడిన పనిముట్లలో ఈ  మచ్చుకత్తి లేదా మొద్దుకత్తి ఒకటి. పట్టుకోవడానికి పిడికిలి ఉన్న పదునైన అంచున్న రాతికత్తి ఇది. 10అంగుళాల పొడవు, 7అంగుళాల వెడల్పు కలిగివున్నది.

గతంలో తెలంగాణ ప్రాక్చరిత్రకారుడు కీ.శే.ఠాకూర్ రాజారాంసింగ్ చెప్పినట్టు ఇటువంటి పనిముట్లు జంతువధశాలల వద్ద  లభిస్తాయి. ఈ పరికరం కొత్తరాతియుగానికి చెందిందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం  కన్వీనర్  శ్రీరామోజు హరగోపాల్ చెప్పారు.


Tags:    

Similar News