రేవంత్ సోదరుడికి నోటీసులు..ఇల్లు కూల్చేస్తారా ?
దుర్గంచెరువును ఆక్రమించి కట్టిన ఇళ్ళల్లో ఉంటున్నందుకు ఇంటిని కూల్చేయటానికి 30 రోజులు గడువు ఇస్తున్నట్లు నోటీసులో ఉన్నతాధికారులు స్పష్టంగా చెప్పారు.
చెరువును ఆక్రమించి నిర్మించిన నిర్మాణాల్లో ఉంటున్నందుకు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి రెవిన్యు ఉన్నతాధికారులు నోటీసులు జారీచేశారు. దుర్గంచెరువును ఆక్రమించి కట్టిన ఇళ్ళల్లో ఉంటున్నందుకు ఇంటిని కూల్చేయటానికి 30 రోజులు గడువు ఇస్తున్నట్లు నోటీసులో ఉన్నతాధికారులు స్పష్టంగా చెప్పారు. ఇంటిని కూల్చడానికి తిరుపతిరెడ్డికి అధికారులు 30 రోజులు గడువిచ్చారు. 30 రోజుల్లో ఇంటిని కూల్చకపోతే తర్వాత తామే ఇంటిని కూల్చేస్తామని చెప్పటం ఇపుడు సంచలనంగా మారింది. రేవంత్ సోదరుడు కూడా చెరువును ఆక్రమించి నిర్మించిన ఇంటిలోనే ఉంటున్నట్లు కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయమై రేవంత్ స్పందిస్తు చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణాల్లో ఎవరుంటున్నా ఆ నిర్మాణాలను కూల్చేయాల్సిందే అని హైడ్రాను ఆదేశించారు. తన సోదరుడు లేదా బంధువులు చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి చేసిన నిర్మాణాల్లో ఉంటున్నట్లు ఆధారాలిస్తే తానే దగ్గరుండి నిర్మాణాలను కూల్చేయిస్తానని రేవంత్ ప్రకటించారు.
రేవంత్ ప్రకటించి 24 గంటలు కాకుండానే రెవిన్యుశాఖ ఉన్నతాధికారులు రేవంత్ సోదరుడు దుర్గంచెరువును ఆక్రమించి ఎఫ్ టిఎల్ పరిధిలో నిర్మించిన కాలనీలో ఇంటిని కొనుగోలుచేశారు. ఇపుడా ఇంటిని కూల్చేస్తామని అధికారులు నోటీసులు ఇచ్చారు. దుర్గంచెరువును ఆక్రమించి నిర్మించిన వివిధ కాలనీల్లోని 204 ఇళ్ళను కూల్చేస్తామని రెవిన్యు అధికారులు నోటీసులు జారీచేశారు. చెరువుకు రెండువైపులా ఆక్రమణలు చేసి ఖరీదైన లేఅవుట్లను బిల్డర్లు నిర్మించారు. వీటిల్లో రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులే కాకుండా అఖిలభారత సర్వీసు అధికారులు అంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు కూడా ఖరీదైన ఇళ్ళను కొన్నారు. దాంతో ఈ కాలనీల జోలికి వెళ్ళాలంటేనే అధికారులు భయపడుతున్నారు. దుర్గంచెరువును ఆక్రమించి కాలనీలు ఏర్పాటుచేసిన విషయం అందరికీ తెలుసు. అయినా ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్ లో నిర్మించిన ఇళ్ళల్లో దుర్గంచెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి, బఫర్ జోన్ పరిధిలోకి వచ్చిన ఇళ్ళ కూల్చేవేతకు అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఇపుడు హైడ్రా ఏర్పాటుతో ఇలాంటి వ్యవహారాలన్నీ వెలుగుచూస్తున్నాయి. ఇందులో భాగంగానే రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూల్చివేత నోటీసులు జారీ అయ్యాయి. ఇదే విషయమై తిరుపతిరెడ్డి మాట్లాడుతు తాను 2015లో ఇల్లు కొన్నపుడు ఎఫ్ టీఎల్ అని ఎవరూ చెప్పలేదన్నారు. ఇప్పటికైనా తాను కొనుగోలుచేసిన ఇల్లు దుర్గంచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ పరిదిలోకి వస్తుందని అనుకుంటే నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చన్నారు.