నాయనా! నిత్యానందం, ఈ సంస్కృత శృంగారమేమిటి బాబూ!

ఆవులకి సంస్కృతం నేర్పుతాడట స్వామి నిత్యానంద .. సెక్స్ స్కాంలో చిక్కుకున్న ఈ స్వామిజీపై ప్రముఖ కవి తమ్మినేని అక్కిరాజు రాసిన సెటైరికల్ కవిత;

Update: 2025-02-03 03:16 GMT

(తమ్మినేని అక్కిరాజు)

*******
నాయనా!నిత్యానందం!
నీ నిత్య శృంగారం
కంపుగొట్టే దుర్గంధం!
దేశమంతా తెలుసు!

ఇన్నాళ్లు ఏమైపోయావ్?
ద్వీపాంతరం పోయావా?
అక్కడేగా నీ దుకాణం ?
మళ్ళీ ఎందుకు ప్రత్యక్షం?

పురాణ గ్రంధాల నిండా
నీలాంటి మన్మధులు
మీకేమీ కొత్త కాదు!
అప్పుడు సరిపోయింది!

ఇది వైజ్ఞానిక యుగం
మీ మాయదారి కూతల్ని
జనం ఎదురు ప్రశ్నిస్తారు!
ఇక్కడున్నది హేతువాదం!

ఆవులకు సంస్కృతమా?
కోతులకూ నేర్పుతావా?
జనానికి 'కూడు' లేదు
ఉండేందుకు'గూడు'లేదు!

వైద్యం విద్య లభించక
మాయదారి రోగాలతో
అల్లాడి పోతున్నారు!
ఆ బాధలు పట్టవు మీకు!

కుండల్లోంచి పుట్టారు
చెమట లోంచి పుట్టారు
రోమాల్లోంచి పుట్టారు
ఎలాబడితే అలా పుట్టారు!

పాయసానికి పుట్టారు
భూమిలోంచి పుట్టారు
పర్వతాలు సముద్రాలు
దేనికైనా పుట్టేశారు!

పుట్టగానే ఒకడు
తపస్సు కోసమని
వాళ్ళ అమ్మతో చెప్పి
వనాలకు పోయాడు!

మీరు ఏమన్నా చేస్తారు!
అబద్ధాలెన్నైనా రాస్తారు!
జనానికి మతి పోగొట్టి
ఎదురు చెప్పనివ్వ లేదు!

ఇప్పుడు'నువ్వు'వచ్చావు
యుగ యుగాలుగా
జనాన్ని ఏడిపించారు
ఇంకా అది చాలలేదు!

జంతువులకు సంస్కృతం!
మీరున్నారుగా!చాలదా?
నేర్పితే నేర్పుకో -వాటికి
మీకు సరిపోతుంది!

ద్వీపాంతరం పోయి
ఆవులు కోతులతో
అక్కడ శృంగారం చెయ్యి
వికృత శిశువులు పుడతారు

అక్కడ మురళి వాయించు
పాములుకూడా వస్తాయి!
ఎందుకురా? ఈ దేశాన్ని
ఇలా నాశనం చేస్తారు?

మీకట్టుకథలు పిల్లచేష్టలు
ఇంకా 'జనం' వింటారనే!
యధారాజాతధాస్వాములు
మా 'కర్మ'ఇలా కాలింది!

ఇకనుండి మా 'కర్మలు'
మీ అబద్ధాలడొక్క చించి
సత్యడోలు వాయించటమే!
మీ మాయలు సాగవు!

మీ మాయలనుండి మేము
జనాన్ని బైటకు తెచ్చాము!
మనుషులుగా మార్చాము!
మనుషులుగా జీవిస్తాము!

తమరు దయచేయండి!
ద్వీపాంతరం పోయి
అక్కడ జంతువులతో
సంస్కృత శృంగారం చేసుకో
***
(స్వామి నిత్యానంద ఆవులకి
సంస్కృతం నేర్పుతాడట)
Tags:    

Similar News