ప్రియుడిపై పోక్సో కేసు

సహకరించిన ఇద్దరు అరెస్ట్;

Update: 2025-07-25 09:47 GMT

ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ప్రేమికుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రేమ జంటకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి యజమానులపై హైదరాబాద్ ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి కటకటాకలకు పంపారు. . ఫిలింనగర్ లో నివాసముండే ఓ యువకుడు, మైనర్ బాలిక ప్రేమించుకున్నారు. వీరిద్దరికి అఖిల్ అనే వ్యక్తి తన గదిని అద్దెకిచ్చాడు. ఇద్దరి మధ్య విభేధాలు రావడంతో మైనర్ బాలిక విడిపోయి పోలీసులను ఆశ్రయించింది. తనను సదరు యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసినట్టు ఫిర్యాదు చేసింది. విచారణలో మైనర్ బాలిక అన్ని విషయాలు తెలిపింది. తమకు అద్దెకిచ్చిన అఖిల్ , నిఖిత పేర్లు వెల్లడించింది. ప్రియుడుపై పోక్సో కేసు నమోదు చేయడమే గాక ప్రేమికులకు అద్దెకిచ్చిన అఖిల్, నిఖిత్ లను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు.

పెళ్లయిన జంటకు మాత్రమే అద్దెకివ్వాలని చట్టాలు చెబుతున్నాయి. ఈ కేసులో ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన యువకుడికి అద్దెకివ్వడం చట్ట విరుద్దమని ఫిలింనగర్ పోలీసులు తెలిపారు. నేర ప్రవృత్తి ఉన్న యువకుడికి కోనవెంకట్, నిఖిత్ అద్దెకివ్వడం చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని పోలీసులు తెలిపారు. ఇటీవలె నేరస్థులకు అద్దెకివ్వడం ఇంటి యజమానులకు పరిపాటైంది. డబ్బులకు కక్కుర్తి పడ్డ యజమానులు ఎవరికి పడితే వారికి అద్దెకివ్వడం వల్ల నేరాలను ప్రోత్సహించడమే అవుతుందని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News