సిటీలో సైకిల్ పోలీసులు, రాచకొండ సిపి సుధీర్ బాబు కొత్త ప్రయోగం

రాచకొండ పోలీసు కమిషనర్‌గా వచ్చిన జి సుధీర్‌బాబు విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు.

Update: 2024-07-31 13:51 GMT
సైకిల్ పెట్రోలింగ్ : విజిబుల్ పోలీసింగ్

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల భాగస్వామ్యం పెంచేందుకు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తూ నూతన పంథాలో శాంతిభద్రతల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ అయ్యేలా, ప్రజల్లో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం మరింత పెరిగేలా సైకిళ్లపై పోలీసు పెట్రోలింగ్ చేపట్టారు.మాదకద్రవ్యాలకు అడ్డుకట్ట వేసి, సైబర్ నేరాలు నివారించేందుకు పోలీసులు ప్రజల చెంతకు చేరుకుంటున్నారు.


శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా పోలీసులు
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రజలకు చేరువ అయ్యేలా విజిబుల్ పోలీసింగ్ కు కొత్త పోలీసు కమిషనర్ వినూత్న చర్యలు చేపట్టారు.ప్రజలకు భద్రత కల్పించి శాంతి భద్రతలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకున్నారు.శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కొత్త కమిషనర్ చర్యలు చేపట్టారు. విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సుధీర్ బాబు చెప్పారు.

సైకిళ్లపై పోలీసు పెట్రోలింగ్


విజిబుల్ పోలీసింగ్ ద్వారా నేరాలకు అడ్డుకట్ట

విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్, నేరాల నియంత్రణలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా నేరాల సంఖ్యను తగ్గిస్తామని జి సుధీర్ బాబు చెప్పారు. రాచకొండ పరిధిలో బ్లూకోల్ట్స్, పెట్రోకార్, సైకిల్ పెట్రోలింగ్ ద్వారా నేరాలను నియంత్రిస్తామని పేర్కొన్నారు. డయల్ 100 లేదా 112 నంబరుకు ఫోన్ చేస్తే పెట్రోకార్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వస్తారని ఆయన తెలిపారు. బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ డ్యూటీల్లో మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంచామన్నారు.

రాచకొండ పోలీసు కమిషనర్ జి సుధీర్ బాబు

సైకిల్ పెట్రోలింగ్
రాచకొండ పరిధిలోని పోలీసుస్టేషన్లకు అయిదు సైకిళ్లను పంపిణీ చేసి అయిదుగురు పోలీసులతో సైకిల్ పెట్రోలింగ్ చేపట్టామని చెప్పారు. మహిళలపై వేధింపులను నివారించేందుకు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశామని కమిషనర్ చెప్పారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను తగ్గించేందుకు తాము ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వర్క్, వర్క్ అవుట్ రెండు కలిసి వచ్చేలా పోలీసులు సైకిల్ పెట్రోలింగ్ చేపట్టామని ఆయన వివరించారు.సైకిల్ పెట్రోలింగ్ బృందాల్లో మగ పోలీసులే కాదు మహిళా పోలీసులను కూడా మోహరించారు. వర్షాకాలంలో పోలీసుల సైకిల్ పెట్రోలింగ్ ద్వారా సులభంగా తిరుగుతున్నారు.

డ్రగ్స్ నుంచి విముక్తికి కార్యాచరణ ప్రణాళిక
డ్రగ్స్ నుంచి యువతకు విముక్తి కల్పించేందుకు రాచకొండ పోలీసు కమిషనర్ జి సుధీర్ బాబు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. డ్రగ్స్ నుంచి విముక్తులైతే జీవిత కాల స్వేచ్ఛ పొందుతారని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ కు దూరంగా విలువలతో కూడిన జీవితాన్ని ఆస్వాదించాలని కమిషనర్ కోరారు. డ్రగ్స్ నియంత్రణపై యువతలో చైతన్యం తీసుకురావడంతోపాటు సైబర్ నేరాల నివారణకు రాచకొండ పోలీసు కమిషనర్ జి సుధీర్ బాబు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

హనీట్రాప్‌లో పడే ప్రమాదం ఉంది...జర జాగ్రత్త
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రజలు తెలియని, పరిచయం లేని వారు మీపై ఆసక్తి చూపిస్తున్నారా? అయితే జాగ్రత్త అని రాచకొండ పోలీసులు హెచ్చరించారు. హనీ ట్రాప్ లో పడే ప్రమాదముందని, జర జాగ్రత్తగా ఉండాలని రాచకొండ పోలీసులు ప్రచారం చేస్తున్నారు.


Tags:    

Similar News