మావోయిస్టుల దగ్గర 400 కిలోల బంగారం ?

మావోయిస్టులు రెగ్యులర్ గా నిదులు సేకరిస్తుంటారని అందరికీ తెలిసిందే. కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు తదితరుల నుండి కోట్లరూపాయలను సేకరిస్తుంటారు

Update: 2025-10-31 02:50 GMT
Gold deposits with Maoists

నమ్మలేని నిజాలంటే ఇదేనేమో. విషయం ఏమిటంటే మావోయిస్టుపార్టీ దగ్గర రు. 400 కోట్లు ఉన్నట్లు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, పోలీసులు అనుమానిస్తున్నారు. ఆడబ్బును మావోయిస్టుపార్టీ అగ్రనేతలు బంగారం రూపంలోను, బ్యాంకు ఖాతాల్లోను, బినామీఖాతాలతో పాటు అడవుల్లోని సురక్షిత ప్రాంతాల్లోని భూగర్భంలో క్యాష్ రూపంలోనో దాచినట్లు లొంగిపోతున్న మావోయిస్టునేతల ద్వారా పోలీసులకు సమాచారం అందుతోంది. పార్టీ ఆధీనంలో వివిధ ప్రాంతాల్లో 400 కిలోల బంగారంనిల్వలు ఉన్నట్లు సమాచారం అందింది. తమకు అందిన సమాచారంతో పోలీసులకు పెద్ద షాక్ తగిలినట్లయ్యింది.

రోజువారీ వ్యవహారాలు నడపటానికి, ఆయుధాలు సమకూర్చుకోవటానికి, వైద్యారోగ్యంతో పాటు అనేక అవసరాలకోసం మావోయిస్టులు రెగ్యులర్ గా నిధులు సేకరిస్తుంటారని అందరికీ తెలిసిందే. కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు తదితరుల నుండి కోట్లరూపాయలను సేకరిస్తుంటారు. మావోయిస్టులు అడిగితే డబ్బివ్వని వాళ్ళు ఎవరైనా ఉంటారా ? అడిగినంత డబ్బిచ్చి దణ్ణం పెట్టేస్తారు. పైగా ఈ విషయాన్ని మూడోకంటికి కూడా తెలియనివ్వరు.

కరోనాసమయంలో యావత్ ప్రపంచం ప్రాణభయంతో వణికిపోతుంటే మావోయిస్టులు మాత్రం భారీఎత్తున నిధుల సేకరణకు అవకాశంగా తీసుకున్నారని నిఘావర్గాలు వివరాలు సేకరించాయి. తమదగ్గరున్న డబ్బును డొల్లకంపెనీల్లో పెట్టి దాచుకున్నట్లు తెలుసుకున్నారు. అవకాశం ఉన్నచోట్లంతా డబ్బును పెట్టుబడులుగా, బ్యాంకు ఖాతాల్లో, లాకర్లలో దాచుకున్న మావోయిస్టుపార్టీ చివరకు ఎక్కడ దాచుకోవాలో తోచక చివరకు బంగారంరూపంతో పాటు క్యాష్ రూపంలో అడవుల్లో డంపుల్లో దాచిపెట్టినట్లు లొంగిపోయిన మావోయిస్టునేతల్లో కొందరు తాజాగా పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం.

ఝార్ఖండ్ కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుడు దినేష్ గోపేను ఆగస్టులో ఈడీ అధికారులు అరెస్టుచేశారు. విచారణలో దినేష్ భార్య, బంధువులు పేరుతో డొల్లకంపెనీలు ఏర్పాటుచేసి వాటిల్లో రు. 20 కోట్లు దాచినట్లు బయటపెట్టాడు. బీజాపూర్ పోలీసులు మూల్ వాసీ బచావో మంచ్ కు చెందిన ఇద్దరు సభ్యుల బ్యాంకు ఖాతాల్లో రు. 6 లక్షలు డిపాజిట్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గతంలో మావోయిస్టు స్పెషల్ ఏరియా కమిటి సభ్యుడు ప్రద్యుమ్నశర్మ బంధువు ఒకమ్మాయి చెన్నైలోని మెడికల్ కాలేజీలో చదివింది.ఆమె చదువుకు అవసరమైన రు. 1.13 కోట్లు బ్యాంకుల ద్వారానే కాలేజీ ఖాతాలో డిపాజిట్ అయినట్లు నిఘావర్గాలు గమనించాయి.

తాజాగా అందుతున్న సమాచారం ఆధారంగా మావోయిస్టులు తాము వసూళ్ళుచేసిన వందల కోట్లరూపాయల్లో అవసరాలకు వాడుకోను మిగిలిన డబ్బును వందలాదిమంది బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు చేయటం, లేదా బినామీల పేరుతో లాకర్లలో దాచటం, బంగారం రూపంలో తమ దగ్గరే ఉంచుకున్నారన్న విషయం ఇపుడు వెలుగుచూసింది.

Tags:    

Similar News