తెలంగాణ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్

Update: 2024-05-13 00:22 GMT
Live Updates - Page 2
2024-05-13 08:37 GMT

మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం..40.38

అదిలాబాద్ -50.18

భువనగిరి -46.49

చేవెళ్ల -34.56

హైద్రాబాద్ -19.37

కరీంనగర్-45.11

ఖమ్మం-50.63

మహబూబాబాద్-48.81

మహబూబ్నగర్-45.84

మల్కాజిగిరి-27.69

మెదక్-46.72

నాగర్ కర్నూల్ -45.88

నల్గొండ-48.48

నిజామాబాద్-45.67

పెద్దపల్లి-44.87

సికింద్రబాద్-24.91

వరంగల్-41.23

జహీరాబాద్-50.71

సికింద్రబాద్ కంటోన్మెంట్..29.03

అత్యధిక పోలిక నమోదైన పార్లమెంట్ సెగ్మెంట్ జహీరాబాద్ 50.71%

అత్యల్పంగా హైదరాబాద్ 19.37%

2024-05-13 08:26 GMT

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీతక్క మూలుగు జిల్లాలోని తన సొంత గ్రామం జగ్గన్నపేటలో ఓటేశారు. 

2024-05-13 08:14 GMT

తెలుగులో ట్వీట్ చేసిన మోదీ

భారత ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. 4 వ విడత పోలింగ్ జారుతున్న నేపథ్యంలో ఓటర్లకు ట్విట్టర్ వేదికగా సందేశమిచ్చారు.  

2024-05-13 08:02 GMT

2024 లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్న జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్, కుటుంబ సభ్యులు.

2024-05-13 07:56 GMT

పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో ఇద్దరు మృతి

అశ్వారావుపేట మండలం వేదాంతపురంలో కాశి వెంకటేశ్వరరావు(54) అనే ఓటర్ ఓటు‌ వేసి వెళ్తుండగా గుండెపోటుకు గురై మృతి. అశ్వరావుపేట పేరాయి గూడెంలో ఎన్నికల విధులు నిర్వహిస్తూ హార్ట్ ఎటాక్ వల్ల శ్రీకృష్ణ(42) మృతి.

2024-05-13 07:32 GMT

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఈటెల

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మండలం మల్లంపేటలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లను మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పరిశీలించారు. మల్కాజ్‌గిరిలో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

2024-05-13 07:07 GMT

'తెలంగాణలో కాంగ్రెస్ గాలి'

అల్వాల్ ఐటిఐ గవర్నమెంట్ కళాశాలలో భార్య వాణి కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి నడుస్తుందని, 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఆయాభావం వ్యక్తం చేశారు.

2024-05-13 07:01 GMT

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాంనగర్ జె.వి.హై స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 232 లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2024-05-13 06:59 GMT

ఖమ్మం జిల్లా మధిరలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

2024-05-13 06:57 GMT

లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Tags:    

Similar News