టీచర్లకు పిఆర్సీ అమలు చేయాలి: తెలంగాణ యుటిఎఫ్

ఆఫీస్ బేరర్ల సమావేశంలో డిమాండ్;

Update: 2025-07-06 14:29 GMT

పిఆర్సీ అమలు గడువు దాటి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నాఅమలు కావడం లేదని తెలంగాణ యుటిఎఫ్ ఆరోపించింది. వెంటనే పిఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలు చేయాలని డిమాండ్ చేసింది.

ఆదివారం సంఘం రాష్ట్ర కార్యాలయంలో యుటిఎప్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి చావ రవి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. సమస్యల పరిష్కారానికి అనేక విరోచిత పోరాటాలు నిర్వహించాల్సి వచ్చిందని, ఈ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఉపాధ్యాయ, ఉద్యోగులు పోరాటాలకు సిద్ధ పడినప్పుడు మాత్రమే మన హక్కులు సాధించుకుంటామని పిలుపునిచ్చారు.

మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పదవీవిరమణ ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ యుటిఎఫ్ డిమాండ్ చేసింది

రూ 700 కోట్లు ఎక్కడ

ప్రతినెల రూ 700 కోట్ల బకాయిలు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని కానీ గత నెల 180 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మంత్రి వర్గం నిర్ణయించిన ప్రకారం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల పనివేళలు శాస్త్రీయంగా సవరించాలన్నారు. మోడల్ స్కూల్, గురుకుల టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. .

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం సంక్షోభంలో ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రవి అన్నారు. ఊరి బడిని కాపాడుకోవాల్సిన అవసరం సమాజంపై ఉందన్నారు. ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని, ఉన్నత పాఠశాలల్లో 11,12 తరగతులను ప్రారంభించాలనే ప్రతిపాదనను స్వాగతిస్తున్నామన్నారు. అయితే పాఠశాలల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించిన తర్వాతే 11,12 తరగతులను ప్రారంభించాలని కోరారు. అదేవిధంగా ఇంటర్ విద్యలో బలంగా వేళ్ళూనుకున్న కార్పోరేట్ విద్యా వ్యాపారాన్ని పాఠశాల విద్యలో ప్రవేశించకుండా అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జులై 9 న కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు టిఎస్ యుటిఎఫ్ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రవి ప్రకటించారు.

Tags:    

Similar News