ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

ప్రభాకర్ రావు నుంచి ల్యాప్ టాప్, సెల్ ఫోన్ స్వాదీనం;

Update: 2025-07-09 07:10 GMT

తెలంగాణలో సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఐపిఎస్ అధికారి లాప్ ట్యాప్, ఫోన్ లను   స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ( సిట్ )

 స్వాధీనం చేసుకుంది. కీలకమైన డేటాను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తవులను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు.

2023 అక్టోబర్ నుంచి 2024 వరకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. కెసీఆర్, కెటిఆర్ ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పటికే సిట్ అధికారులు తేల్చారు. దాదాపు 4, 500 ఫోన్లను బిఆర్ ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు సర్వీస్ ప్రొవైడర్ అందిన డాటాలో 618 ఫోన్ నెంబర్లు ఉన్నట్టు సిట్ అధికారులు తెలిపారు. రిట్రైవ్, హార్డ్ డిస్క్లపై అధికారులు ఆశ పెట్టుకున్నారు. ఆ ఢేటాను సేకరించే పనిలో సిట్ ఉంది. అమెరికా నుంచి రప్పించిన ప్రభాకర్ రావును ఇప్పటికే విచారణ చేసిన అధికారులు రేపు మరో మారు విచారణ చేసే అవకాశం ఉంది.త ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే కాకుండా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో కాంగ్రెస్ నేతలు ఎక్కువగా ఉన్నారు. బిజెపి ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావులను ఇప్పటికే విచారణ చేసిన సిట్ బాధితులను విచారణ చేయనుంది. 

Tags:    

Similar News